Viral Video: అర్ధరాత్రి రైల్వే గేటువద్ద చిరుత.. దాటాలా.. వద్దా.. అని డౌట్ పడ్డట్టుంది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లిలో ని రైల్వే గేటు సమీపంలో రాత్రిపూట చిరుత సంచరించినట్లు ఖలీల్ అనే వ్యక్తి ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా లో రికార్డయింది. ఆ ఇంటి గేటుముందునుంచి చిరుత నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీ టీవీలో స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు పొత్కపల్లిలోని పెద్ద చెరువు సమీపంలో చిరుత పులి సంచరించినట్లు పలువురు వాహనదారులు సైతం చెప్పినట్టు ఖలీల్ తెలిపాడు.
ఇటీవల వన్యమృగాలు జనావాలసాల్లోకి చొరబడుతున్నాయి. వనాల్లో ఆహారం, నీరు కరువవడంతో గ్రామాల్లోకి, జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలో చిరుత సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాలను చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లిలో ని రైల్వే గేటు సమీపంలో రాత్రిపూట చిరుత సంచరించినట్లు ఖలీల్ అనే వ్యక్తి ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా లో రికార్డయింది. ఆ ఇంటి గేటుముందునుంచి చిరుత నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీ టీవీలో స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు పొత్కపల్లిలోని పెద్ద చెరువు సమీపంలో చిరుత పులి సంచరించినట్లు పలువురు వాహనదారులు సైతం చెప్పినట్టు ఖలీల్ తెలిపాడు. దీంతో పొత్కపల్లిలో చిరుత సంచరించడం పట్ల రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత ఫారెస్ట్ అధికారులు వచ్చి చిరుత పులి ఆనవాళ్లను గుర్తించి, చిరుతను పట్టుకొని తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.