Sailing Regatta: అద్భుత దృశ్యం.. ఈ వీడియో చూసి వావ్ అనకుండా ఉండగలరా ఛాలెంజ్.. సముద్రంపై అలా..
రెక్కలు విప్పుకుని వాలినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది కదూ. అయితే, ఇవి పక్షులు కాదు.. తెరచాప పడవలు. ఇటలీలోని ట్రీస్టెలో ఏడ్రియాటిక్ సముద్ర తీరం వెంట జరుగుతున్న..
సముద్రంపై పక్షుల్లా . తెరచాప పడవలు రెక్కలు విప్పుకుని వాలినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది కదూ. అయితే, ఇవి పక్షులు కాదు.. తెరచాప పడవలు. ఇటలీలోని ట్రీస్టెలో ఏడ్రియాటిక్ సముద్ర తీరం వెంట జరుగుతున్న 54వ బార్కొలానా పడవపందెంలో భాగంగాఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బార్కొలానా వీక్ పేరుతో ఈ పోటీలు నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పడవ పోటీగా ఇది.. 2018లోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది ఈ పడవల పందెం. ప్రస్తుతం వారం రోజుల పాటు అట్టహాసంగా సాగిన ఈ తెరచాప పడవల పరుగు పందెం 54వ ఎడిషన్. ఇందులో 2,689 పడవలు పాలుపంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతీ ఏటా అక్టోబర్ రెండో వారంలో ట్రీస్టే గల్ఫ్ ప్రాంతంలో ఈ పడవల పందెన్ని నిర్వహిస్తారు..పడవల ఆకృతుల ఆధారంగా వాటిని విభజించి పోటీలు నిర్వహిస్తారు. తొలిసారి 1969లో ఈ తెరచాప పడల పోటీలు నిర్వహించగా అందులో 51 బోట్లు పాల్గొన్నాయి. ఆ తర్వాత ఆదరణ పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెయిలర్స్ ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తుండడంతో ఇందులో పాల్గొనే పడవల సంఖ్య గణనీయంగా పెరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..