Viral: మిరాకిల్.. ఒకే కాన్పులో నలుగురికి జన్మ.. కానీ గంటల వ్యవధిలోనే శిశువులందరూ..?
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చాలా అరుదుగా ఓ గర్భిణికి ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. కానీ ఆ నలుగురు పసిపాపలు గంటల వ్యవధిలోనే చనిపోయారు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే.. కుప్వారా జిల్లాలోని కేరాన్ గ్రామానికి చెందిన కలీదా బేగం గర్భిణి. ఆమెకు నొప్పులు రావడంతో ఆదివారం సాయంత్రం స్థానికంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని...
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చాలా అరుదుగా ఓ గర్భిణికి ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. కానీ ఆ నలుగురు పసిపాపలు గంటల వ్యవధిలోనే చనిపోయారు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే.. కుప్వారా జిల్లాలోని కేరాన్ గ్రామానికి చెందిన కలీదా బేగం గర్భిణి. ఆమెకు నొప్పులు రావడంతో ఆదివారం సాయంత్రం స్థానికంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని, కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని కలీదా కుటుంబ సభ్యులకు సూచించారు. ఇక సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుప్వారా జిల్లా ఆస్పత్రిలో కలీదా నార్మల్ డెలివరీ ద్వారా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. నలుగురిలో ముగ్గురు అమ్మాయిలు కాగా, ఒకరు అబ్బాయి. శిశువులందరూ తక్కువ బరువుతో జన్మించారు. అయితే ముగ్గురు అమ్మాయిలు కుప్వారా ఆస్పత్రిలోనే మరణించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీ, అబ్బాయిని శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాబు కూడా చనిపోయాడు. ఇలా గంటల వ్యవధిలోనే నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలీదాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కలీదా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..