YouTube: యూట్యూబ్ లో పోస్ట్ చేసిన మొదటి వీడియో ఏది.? ఎవరు పోస్ట్ చేసారు..
యూట్యూబ్ ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఒకవైపు కోట్లాది మంది వినోదం పొందుతుండగా, మరోవైపు లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. నేటి రోజుల్లో యూట్యూబర్‌గా మారడం అనేది ఉద్యోగం కంటే మంచి ఆదాయం అందుకోగల ప్రొఫెషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే యూట్యూబ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది? దానిలో పోస్ట్ చేసిన మొదటి వీడియో ఏది? అనే ఆసక్తికర వివరాలు చూద్దాం.
యూట్యూబ్ ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఒకవైపు కోట్లాది మంది వినోదం పొందుతుండగా, మరోవైపు లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. నేటి రోజుల్లో యూట్యూబర్‌గా మారడం అనేది ఉద్యోగం కంటే మంచి ఆదాయం అందుకోగల ప్రొఫెషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే యూట్యూబ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది? దానిలో పోస్ట్ చేసిన మొదటి వీడియో ఏది? అనే ఆసక్తికర వివరాలు చూద్దాం. యూట్యూబ్‌ని 2005లో స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీం ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వీరు దీనిని 165 కోట్ల డాలర్లకు గూగుల్‌కు విక్రయించారు. ఈ రోజు ఈ యాప్‌కున్న క్రేజ్ ఎంతంటే ప్రతి నెలా 200 బిలియన్లకు పైగా వినియోగదారులు దీనిని విజిట్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో మొదటి వీడియో 2005 సంవత్సరంలో ఏప్రిల్ 24న అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో టైటిల్ ‘మీ ఎట్ ది జూ’. ఈ 19 సెకన్ల వీడియోలో జావేద్ ఏనుగుల గురించి మాట్లాడుతూ ‘ఇప్పుడు మనం ఏనుగుల ముందున్నాం. ఏనుగులకు పొడవాటి తొండం ఉంటుంది’ అన్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 291 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. అదే సమయంలో 4.09 మిలియన్ల మంది ఈ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఈ వీడియోను 14 మిలియన్ల మంది లైక్ చేశారు. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఛానెల్‌లో ఈ వీడియో తప్ప మరో వీడియో అందుబాటులో లేకపోవడం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..