Python: 18 అడగుల భారీ కొండచిలువ చూసి జనం పరుగులు

Python: 18 అడగుల భారీ కొండచిలువ చూసి జనం పరుగులు

Nalluri Naresh

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 25, 2023 | 9:28 PM

భారీ కొండచిలువను అటవీశాఖాధికారులతో కలిసి స్నేక్ క్యాచర్ మూర్తి పట్టుకున్నారు. భారీ కొండ చిలువను చూసేందుకు జనం ఎగబడ్డారు. అనంతరం ఆ భారీ కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు స్నేక్ క్యాచర్ మూర్తి. భారీ కొండచిలువను పట్టుకోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు...

వామ్మో ఎంత పెద్ద కొండచిలువో…. చూస్తుంటే గుండెజారి అర చేతిలోకి వచ్చినంత పనైంది. దాదాపు 18 అడుగుల భారీ కొండచిలువను చూసి జనం పరుగో పరుగు….. అంత భారీ కొండచిలును చూస్తుంటే గొర్రెలు, మేకలనే కాదు…. ఏకంగా మనుషుల్ని మింగేసే అంతగా ఉంది. బుక్కపట్నం మండలం గూనిపల్లి గ్రామంలో జనావాసాల్లోకు 18 అడుగుల భారీ కొండచిలువ వచ్చింది. భారీ కొండచిలువను చూసి గ్రామస్తులు కాళ్లకు పని చెప్పారు. ఎస్సీ కాలనీలోనే కొండచిలువ తిష్ట వేసి… అక్కడి నుంచి కదలకపోవడంతో… చేసేదేంలేక అటవీ శాఖ అధికారులకు, స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. భారీ కొండచిలువను అటవీశాఖాధికారులతో కలిసి స్నేక్ క్యాచర్ మూర్తి పట్టుకున్నారు. భారీ కొండ చిలువను చూసేందుకు జనం ఎగబడ్డారు. అనంతరం ఆ భారీ కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు స్నేక్ క్యాచర్ మూర్తి. భారీ కొండచిలువను పట్టుకోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Oct 25, 2023 06:53 PM