Elderly Couple Dance: మన ఇంట్లో లేదా మన పరిసరాల్లో చిన్నపిల్లలు ఉంటె ఆ సందడే వేరుగా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పనీ మనకు ఆశ్చర్యంతో పాటు మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. అదేవిధంగా పెద్ద వయసు వారు మనల్ని అప్పుడప్పుడు విసిగించినా.. ఒక్కోసారి వాళ్ళు చేసే పనికి మనం ఫిదా అయిపోతాం. ఆ ముసలోళ్ళు అని అనుకునే మనకి వాళ్ళు ఎనర్జిటిక్ గా చేసే కొన్ని పనులు చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతాం. అటువంటిదే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా పాప్యులర్ అవుతోంది. వారికి ఏమనిపించిందో ఏమో ఆ ఫంక్షన్ లో ఒక్కసారిగా అదిరిపోయే స్టెప్పులు వేశారు. అది చూసిన అక్కడి జనం ఈ డాన్స్ కెవ్వు కేక అని అంటే… ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాకా నెటిజనం అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు.
పదిహేను నిమిషాల ఈ క్లిప్ ను సోషల్ మీడియా యూజర్ ఫ్రెడ్ షుల్ట్జ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన వారు కచ్చితంగా ఆనందిస్తారని ఆయన కామెంట్ చేశారు. ఈ చిన్న క్లిప్‌లో, మెరూన్ దుస్తులు, అలాగే నల్ల చెప్పులతో సొగసైన స్త్రీ, తన భర్తతో శక్తివంతమైన నృత్య దశలను ప్రదర్శించింది. పువ్వులు ముద్రించిన రంగుల చొక్కా, నల్ల ప్యాంటులో ఆ పెద్దాయన యువకుడైపోయాడు. వేదికపై ఒక సంగీత బృందం సంగీతం వినిపిస్తుంటే.. వేదికను అలంకరించిన బెలూన్లు వారి డ్యాన్స్ చూస్తూ కదులుతున్నట్టు కనిపిస్తోంది. అక్కడేదో కార్యక్రమం జరుగుతుంటే, ఈ జంట తమ నృత్యంతో అదరగొట్టారు.
ఈ వీడియోలో మీరు వారి డ్యాన్స్ చూడొచ్చు..
They still got it. ????? pic.twitter.com/gzv1uo3Ghc
— Fred Schultz (@fred035schultz) May 7, 2021
Elderly Couple Dance ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చినప్పటి నుండి, క్లిప్ గ్యాస్ 20,000 మంది లైక్‌లను మరియు 4,000 రీట్వీట్‌లను సంపాదించింది.
ఈ వీడియోకు వచ్చిన కామెంట్లు ఇక్కడ చూడండి..
Age is just number.. ???? pic.twitter.com/tForgjemUT
— ?o̴g̴ (@Yoda4ever) May 7, 2021
Viral video: సముద్రం అడుగున వ్యాయామం.. పాండిచ్చేరి యువకుని సాహసం… ( వీడియో )