వాటే మ్యాజిక్..అరటి ఆకుపై గాల్లో ఎగిరిన కుర్రాడు..! వీడియో
టెక్నాలజీ యుగంలో ఇంటర్నెట్ అందరికీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాంతో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. విశ్వంలో ఏమూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో నెట్టింట ప్రత్యక్షమవుతోంది. ఇంటర్నెట్ పుణ్యమా అని మరుగున పడిన ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తమ ప్రతిభను చాటుతున్నారు. తాజాగా కొందరు పిల్లలు చేసిన ఓ మ్యాజిక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
అయితే ఇక్కడ ఆ చిన్నారులు ఎలాంటి టెక్నాలజీని వాడలేదు… ఎలాంటి మ్యాజిక్..మాయలు మంత్రాలు లేవు.. కానీ వారి ఆలోచన నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అంటూ కామెంట్లు చేస్తున్నారు.నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక బాలుడు అల్లావుద్దీన్ అద్భుత దీపంలో తివాచీమీద ఎగిరినట్టు అరటి ఆకుపై నిల్చుని గాల్లో ఎగిరాడు. ఈ ఘటనను తన మిత్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో చూస్తే ఇదెలా సాధ్యం అనిపిస్తుంది.. అతనేదో మ్యాజిక్ చేశాడనిపిస్తుంది.. అయితే అక్కడే పప్పులో కాలేసారు.. ఆ బాలుడు అరటి ఆకును అతని చెప్పులకు అంటించుకున్నాడు. అతని మిత్రులు ఓ పెద్ద కర్రను అటు,ఇటూ పట్టుకున్నారు. మధ్యలో ఈ కుర్రాడు ఆ కర్రను గట్టిగా పట్టుకుని గాల్లో ఎగురుతున్నట్టుగా కాళ్లు పైకి పెట్టాడు. మిత్రులు ఆ కుర్రాడిని అలా మోస్తూ ముందుకు పరుగెత్తారు. మోస్తున్న కుర్రాళ్లు, పైన కర్ర కనిపించకుండా వీడియోలో కవర్ చేశారు. ఆఖరున విషయం రివీల్ చేసి ఆ పిల్లలు ఆనందంతో చేసిన డ్యాన్స్ మరో హైలైట్. ఇక్కడ కెమెరా మెన్ పనితనం మెచ్చుకోవాల్సిందే.. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లక్షలాదిమంది వీడియోను వీక్షిస్తూ ప్రశంసలు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పీడ్ బోటులో షికారు చేస్తున్న పర్యాటకులు..నది మధ్యలోకి వెళ్లగానే..
భార్యను పాము కాటు వేసిన ప్రాంతానికి వెళ్లిన భర్త..అంతలోనే ఊహించని షాక్ వీడియో
అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే వీడియో
ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు…
భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో.. వీడియో

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
