ఎన్టీఆర్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ రోడ్డుపై నీళ్లు పోస్తుంటే రక్తం లాంటి ద్రవం ఉబికి వచ్చింది. దాంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు స్థానికులు. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలోని ఎస్‌సీకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన పాపకు రోడ్డుపైన స్నానం చేయిస్తుండగా నీళ్లు కిందపడగానే లోపలినుంచి ఎర్రటి ద్రవం ఉబికి వచ్చిందని తెలిపారు. విషయం తెలుసుకొని స్థానికులు గుమిగూడారు. అనంతరం రోడ్డుపైన ఎక్కడ నీళ్లు పోసినా ఇలా ఎర్రటి ద్రవం ఉబికిరావడంతో ఎవరో చేతబడి చేసి ఉంటారంటూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని రాత్రిళ్లు నిద్రపోకుండా రోడ్డుపైనే గడిపారు స్థానికులు . ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా స్థానిక గ్రామ సర్పంచ్ సైదులు సిమెంట్ రోడ్డులో కెమికల్స్ వల్ల ఇలా వస్తుండొచ్చని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..