Viral: తూర్పుగోదావరిలో వింత ఘటన.. దైవ మహిమేనంటూ చూసేందుకు పోటెత్తిన జనం.!

|

Feb 19, 2024 | 11:11 AM

ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఏదో ఒక వింత ఘటన వెలుగులోకి వస్తూనే ఉంటుంది. కొందరు వాటిని దైవ మహిమగా భావించి పూజలు చేస్తే.. కొందరు సైంటిఫిక్‌ రీజన్స్ చెబుతారు. సాధారణంగా తాటిచెట్టునుంచి కల్లు, కొన్నిరకాల చెట్ల ఆకులను కానీ, కొమ్మలను కాని తెంచినప్పుడు పాలు కారడం సహజంగా చూస్తుంటాం. కానీ విచిత్రంగా ఒక్కోసారి చింతచెట్టు, వేపచెట్టు నుంచి కూడా పాలుకారడం చూస్తుంటాం.

ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఏదో ఒక వింత ఘటన వెలుగులోకి వస్తూనే ఉంటుంది. కొందరు వాటిని దైవ మహిమగా భావించి పూజలు చేస్తే.. కొందరు సైంటిఫిక్‌ రీజన్స్ చెబుతారు. సాధారణంగా తాటిచెట్టునుంచి కల్లు, కొన్నిరకాల చెట్ల ఆకులను కానీ, కొమ్మలను కాని తెంచినప్పుడు పాలు కారడం సహజంగా చూస్తుంటాం. కానీ విచిత్రంగా ఒక్కోసారి చింతచెట్టు, వేపచెట్టు నుంచి కూడా పాలుకారడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలు సోషల్‌ మీడియాలోనూ చాలానే చూశాం. తాజాగా అలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది. వేపచెట్టునుంచి ధారాపాతంగా పాలు కారడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. జిల్లాలోని నిడదవోలు మండలం కంసాలి పాలెంలో వేప చెట్టుకి పాలు కారుతున్నాయనే వార్త చుట్టుపక్కల ప్రాంతాలలో దావానంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ చెట్టుకు పూజలు చేసేస్తున్నారు. కంసాలి పాలెం గ్రామం ఊరు చివరన ఓ చెరువు వద్ద వేపచెట్టు నుంచి ఉన్నట్టుండి ధారాళంగా పాలు కారడాన్ని స్థానికుల గుర్తించారు. అది దేవుని మహిమేనని కొందరు పసుపు,కుంకుమ, పూలు, పళ్లతో పూజలు చేశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల గ్రామాల్లో సైతం తెగ వైరల్ గా మారిపోయింది. ఇంక ఇతర ప్రాంతాలనుంచి సైతం మహిళలు అక్కడికి తండోప తండాలుగా చేరి పూజలు చేయడానికి క్యూలు కట్టేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందని, ఇది శుభపరిణామం అంటున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కంసాలిపాలెం గ్రామం ఇప్పుడు ఫేమస్ అయిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..