Snake in AC: ఏసీ ఆన్ చేస్తున్నారా.. జాగ్రత్త..! ఒక్కసారిగా బయట పడ్డ పాము..
వర్షాకాలమే కదా అని కొద్ది రోజులుగా ఏసి వాడటం మానేశారా. మళ్లీ ఏసీ ఆన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓ సారి పరిశీలించండి. లేదంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం క్రిష్టం పల్లి గ్రామంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సురేష్ అనే వ్యక్తి ఇంటిలో పెద్ద నాగుపాము హల్చల్ చేసింది. ఆ ఇంటిలోని ఏసీలో మకాం పెట్టింది. అది గమనించని ఆ ఇంటి యజమాని ఏసీ ఆన్ చేయగానే వింత శబ్ధాలు రావడం గమనించి పరిశీలించగా షాక్ తిన్నాడు.
వర్షాకాలమే కదా అని కొద్ది రోజులుగా ఏసి వాడటం మానేశారా. మళ్లీ ఏసీ ఆన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓ సారి పరిశీలించండి. లేదంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం క్రిష్టం పల్లి గ్రామంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సురేష్ అనే వ్యక్తి ఇంటిలో పెద్ద నాగుపాము హల్చల్ చేసింది. ఆ ఇంటిలోని ఏసీలో మకాం పెట్టింది. అది గమనించని ఆ ఇంటి యజమాని ఏసీ ఆన్ చేయగానే వింత శబ్ధాలు రావడం గమనించి పరిశీలించగా షాక్ తిన్నాడు. ఎండలు తగ్గడంతో గత కొద్ది రోజులుగా సురేష్ ఏసీ ని వినియోగించడం లేదు. అయితే గత వారం రోజులుగా తిరిగి ఎండలు మండిపోతుండటంతో ఏసి వేసుకుందామని ఆన్ చేశాడు. అంతే అప్పటి వరకు ఏసిలో చల్లగా కునుకుతీస్తున్న పాము ఒక్కసారిగా ఏసి వింగ్స్ నుంచి బయటకు వచ్చేసింది… ఏసిలో నుంచి చల్లగాలి వస్తుందని ఎదరు చూసిన సురేష్ కుటుంబ సభ్యులకు అనుకోని అతిధిలా ఏసి నుంచి పాము బయటకు రావడంతో ఖంగుతిన్నారు. పామును చూసిన సురేష్ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే స్నేక్ క్యాచర్‌కు కాల్ చేసే లోపే కిటికీలోంచి బయటకు ఉడాయించింది ఆ పాము. తమకు ఎలాంటి హానీ తలపెట్టకపోవడంతో సురేష్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..