Students in farm: పుస్తకాలు వదిలి.. పొలంలో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్ధులు
చదువు అంటే నూటికి నూరు మార్కులు.. ర్యాంకులు.. పెద్ద ఉద్యోగం భారీ జీతం అనే స్టేజ్ లో నేటి విద్యావ్యవస్థ కొనసాగుతోంది. అయితే వాస్తవానికి చదువు అంటే జ్ఞానం.. ఇంకా చెప్పాలంటే నేర్చుకోవడం, తెలుసుకోవడం అని భారతీయ విద్యావస్థకు అసలు అర్ధం. దీనిని అక్షరాలా పాటిస్తూ విద్యార్ధులకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు అక్కడి ఉపాధ్యాయులు. అవును, రాయచూరు జిల్లా లింగసుగూర్ తాలూకాలోని బెండోని ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు మోడల్ స్కూల్.
చదువు అంటే నూటికి నూరు మార్కులు.. ర్యాంకులు.. పెద్ద ఉద్యోగం భారీ జీతం అనే స్టేజ్ లో నేటి విద్యావ్యవస్థ కొనసాగుతోంది. అయితే వాస్తవానికి చదువు అంటే జ్ఞానం.. ఇంకా చెప్పాలంటే నేర్చుకోవడం, తెలుసుకోవడం అని భారతీయ విద్యావస్థకు అసలు అర్ధం. దీనిని అక్షరాలా పాటిస్తూ విద్యార్ధులకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు అక్కడి ఉపాధ్యాయులు. అవును, రాయచూరు జిల్లా లింగసుగూర్ తాలూకాలోని బెండోని ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు మోడల్ స్కూల్. విద్యార్థులకు వ్యవసాయం గురించి రైతులు పడే కష్టం తెలియజేసే విధంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఉపాధ్యాయులు వ్యవసాయ పాఠాలు బోధించారు. చదువు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమైన ఈ రోజుల్లో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పొలాల్లోకి వెళ్లి వ్యవసాయం గురించి తెలుసుకున్నారు. పొలంలో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్ధులు నాట్లు వేశారు. వ్యవసాయం ప్రాముఖ్యతపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్కూల్ లో ప్రతి శనివారం బ్యాగ్ ఫ్రీ డే ని సెలబ్రేట్ చేస్తారు. ఇందులో భాగంగానే ఈసారి చిన్నారులకు పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం క్షేత్రంలో జరిగే పనులు గురించి తెలియజేశారు. స్టూడెంట్స్ కు వ్యవసాయ పనిముట్ల గురించి పరిచయం చేసి వాటి ఉపయోగాల గురించి వివరించారు టీచర్స్. భూసారం, సేంద్రియ వ్యవసాయం, రసాయన ఎరువుల వాడకం, కొత్త వంగడాలతో సహా చిరుధాన్యాలు, పప్పుధాన్యాల పంటల గురించి స్టూడెంట్స్ కు చెప్పారు. ఉద్యాన, పాడిపరిశ్రమ, పశుపోషణ, తేనెటీగల పెంపకం, సౌరశక్తి వినియోగం, చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త తరహా ఉపాధ్యాయ శిక్షణను ప్రజలు అభినందిస్తున్నారు. మొదట చిన్నారులు పొలంలో పని చేస్తున్న రైతులను ఆసక్తిగా వీక్షించారు. అనంతరం విద్యార్థులు పొలంలోకి దిగి సందడి చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..