Snake in ear: మహిళ చెవిలో ఇరుక్కున్న పాము.. బయటకు తీసేందుకు డాక్టర్‌ తంటాలు.. షాకింగ్‌ వీడియో.

Snake in ear: మహిళ చెవిలో ఇరుక్కున్న పాము.. బయటకు తీసేందుకు డాక్టర్‌ తంటాలు.. షాకింగ్‌ వీడియో.

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Sep 19, 2022 | 11:06 AM

చెవిలో అప్పుడప్పుడూ చిన్న చిన్న కీటకాలు దూరడం మనం చూసి ఉంటాం. వాటిని డాక్టర్‌ సహాయంతో తొలగించుకుంటాం. అయితే ఓ మహిళ చెవిలో ఏకంగా పాము దూరిపోయింది.


చెవిలో అప్పుడప్పుడూ చిన్న చిన్న కీటకాలు దూరడం మనం చూసి ఉంటాం. వాటిని డాక్టర్‌ సహాయంతో తొలగించుకుంటాం. అయితే ఓ మహిళ చెవిలో ఏకంగా పాము దూరిపోయింది. ఇది ఎప్పుడు, ఎక్కడ ఎలా జరిగిందో క్లారిటీ లేదు కానీ.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోను ఓ ఫేస్‌బుక్‌ యూజర్‌ తన ఖాతాలో పోస్ట్‌ చేశారు. చెవిలోపలకు పాము వెళ్లింది అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. కాగా ఆ మహిళ చెవిలోని పామును తీసేందుకు డాక్టర్‌ విశ్వ ప్రయత్నం చేశారు. చేతులకు గ్లౌజులు ధరించి ఫోర్‌సెప్స్‌తో మహిళ చెవిలోంచి నోరు తెరిచి చూస్తున్న పామును బయటకు తీస్తున్నారు. అయితే ఈ వీడియో పూర్తిగా లేకపోవడంతో పామును బయటకు తీశారా లేదా అన్నది సస్పెన్స్‌గా ఉండిపోయింది. కాగా ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకయ్యారు. ఇప్పటికే లక్షలమంది వీక్షించగా వేలల్లో లైక్‌ చేశారు. కాగా వీడియోపై రకరకాలుగా స్పందించారు. కొందరు ఇదంతా ఫేక్‌ అని అభిప్రాయపడ్డారు. మరికొందరు పూర్తి వీడియో ఎందుకు పోస్ట్‌ చేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా, అయితే, వైరల్ అవుతున్న ఈ వీడియో వాస్తవికతను ‘టీవీ9 తెలుగు’ నిర్ధరించలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 19, 2022 09:38 AM