Rare Dog: ఈ శునకం ఖరీదు రూ.20 కోట్లు..! అరుదైన శునకంతో ఫోటోలకోసం ఎగబడిన జనం.

Rare Dog: ఈ శునకం ఖరీదు రూ.20 కోట్లు..! అరుదైన శునకంతో ఫోటోలకోసం ఎగబడిన జనం.

Anil kumar poka

|

Updated on: Dec 20, 2023 | 6:06 PM

సాధారణంగా పెట్‌ డాగ్‌ ఖరీదు ఎంత ఉంటుంది.. మహా అంటే వేలల్లో ఉంటుంది. మరీ ఎక్కువ అనుకుంటే లక్షల్లో ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఈ శునకాల రేటు కూడా కోట్లలో పలుకుతోంది. అవును, ప్రపంచంలో అత్యంత ఖరీదైన, అరుదైన జాతి కుక్క ఒకటి హైదరాబాద్‌ మియాపూర్‌లో సందడి చేసింది. కాకసియాన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ డాగ్ ఖరీదు ఏకంగా 20 కోట్లు. శనివారం మియాపూర్‌లోని విశ్వ పెట్‌ క్లినిక్‌కు ఆరోగ్య పరీక్షల కోసం శునకాన్ని తీసుకువచ్చారు.

సాధారణంగా పెట్‌ డాగ్‌ ఖరీదు ఎంత ఉంటుంది.. మహా అంటే వేలల్లో ఉంటుంది. మరీ ఎక్కువ అనుకుంటే లక్షల్లో ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఈ శునకాల రేటు కూడా కోట్లలో పలుకుతోంది. అవును, ప్రపంచంలో అత్యంత ఖరీదైన, అరుదైన జాతి కుక్క ఒకటి హైదరాబాద్‌ మియాపూర్‌లో సందడి చేసింది. కాకసియాన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ డాగ్ ఖరీదు ఏకంగా 20 కోట్లు. శనివారం మియాపూర్‌లోని విశ్వ పెట్‌ క్లినిక్‌కు ఆరోగ్య పరీక్షల కోసం శునకాన్ని తీసుకువచ్చారు. బెంగళూరుకు చెందిన ఇండియన్‌ డాగ్‌ బ్రీడర్‌ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు సతీశ్‌ 20కోట్లకు ఈ శునకాన్ని కొనుగోలు చేశారు. ఆ శునకానికి కాడాబామ్‌ హైడర్‌ అనే పేరు కూడా పెట్టారు. మూడు సంవత్సరాల వయసు కలిగిన ఈ డాగ్ రోజుకు మూడు కేజీల చికెన్ ను ఆహారంగా తీసుకుంటుదన్నారు. ఈ శునకం సినిమాల్లో కూడా నటిస్తోందని.. అంతర్జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని ఇప్పటివరకు 32 పతకాలు సాధించిందని యజమాని సతీశ్‌ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో జరిగే డాగ్‌ షో కోసం శునకాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. కాడాబామ్‌ హైడర్‌ మియాపూర్‌కు వస్తుందని తెలియడంతో దాన్ని చూసేందుకు స్థానికులంతా ఎగబడ్డారు. దానితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. శునకాలను ఎంతో ఇష్టపడే సతీశ్ గతంలోనూ పలు జాతుల కుక్కలను కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఈ శునకాలను తాను మహారాజులా చూసుకుంటానని సతీశ్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.