Fake Doctor: టెన్త్ కూడా పాస్‌కాని వ్యక్తి.. అయినా ఎంబీబీఎస్ ‘డాక్టర్’గా పదేళ్లు..! వీడియో
తెలంగాణలో ఓ నకిలీడాక్టర్ గుట్టు రట్టయింది. ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా పదేళ్లుగా డాక్టర్‌గా చెలామణి అవుతున్న నకిలీ వైద్యుని అసలురంగు బయటపెట్టారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన ఆకాశ్‌కుమార్ బిశ్వాస్ పదో తరగతి కూడా పాస్ కాలేదు. కొంతకాలం తన తాత వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్నాడు. అదే అర్హతగా జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో ఐఏఎమ్ పేరుతో ఓ క్లినిక్ ఓపెన్ చేశాడు. ‘ఇండియన్ ఆయుర్వేదిక్ మెడిసిన్’ పేరుతో బోర్డు పెట్టుకుని.. రోగులకు అల్లోపతి, ఆయుర్వేద మందులతో వైద్యం చేయడం మొదలుపెట్టాడు. ఇతని వైద్యంతో రోగులకు నయం కాకపోతే వారిని వరంగల్‌లోని పలు ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా సూచించేవాడు. అలా రోగులను ఆయా ఆస్పత్రులకు పంపించినందుకు ఆస్పత్రులనుంచి కమిషన్ తీసుకునేవాడు. ఈక్రమంలో నకిలీ డాక్టర్ గురించి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. పక్కా ప్లాన్‌తో నవంబరు 21న బిశ్వాస్ క్లినిక్‌లో తనిఖీలు చేశారు. అతనివద్ద తగిన వైద్యానికి సంబంధించి తగిన విద్యార్హతగాని, క్లినిక్ నిర్వహణకు సంబంధించిన అనుమతిపత్రాలు కాని లేనట్లు గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..