Monkey Injured: ప్రాణం పోతున్నా పాలిస్తోంది.. ఆ తల్లి వానరానికే సాధ్యం.!

అమ్మ ప్రేమ ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. నవమాసాలు మోసీ.. కనీ.. పెంచి తన బిడ్డకు ఎలాంటి కష్టం కలగకుండా కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది తల్లి. తన ప్రాణం పోయినా పర్వాలేదు బిడ్డను కాపాడుకోగలిగితే చాలు అనే తెగింపు ఒక్క మాతృమూర్తికే చెల్లింది. మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ వుంటుంది తల్లి ప్రేమ. మూడు రోజుల కిందట ఓ తల్లి కోతి తీవ్రంగా గాయపడింది. తలకు గాయమై రక్తమోడుతున్నా పొట్ట కింది భాగంలో ఉన్న పిల్లకు ఎలాంటి దెబ్బ తగలకుండా కాపాడుకుంది.

Monkey Injured: ప్రాణం పోతున్నా పాలిస్తోంది.. ఆ తల్లి వానరానికే సాధ్యం.!

|

Updated on: Jul 30, 2024 | 3:33 PM

అమ్మ ప్రేమ ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. నవమాసాలు మోసీ.. కనీ.. పెంచి తన బిడ్డకు ఎలాంటి కష్టం కలగకుండా కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది తల్లి. తన ప్రాణం పోయినా పర్వాలేదు బిడ్డను కాపాడుకోగలిగితే చాలు అనే తెగింపు ఒక్క మాతృమూర్తికే చెల్లింది. మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ వుంటుంది తల్లి ప్రేమ. మూడు రోజుల కిందట ఓ తల్లి కోతి తీవ్రంగా గాయపడింది. తలకు గాయమై రక్తమోడుతున్నా పొట్ట కింది భాగంలో ఉన్న పిల్లకు ఎలాంటి దెబ్బ తగలకుండా కాపాడుకుంది. తీవ్ర గాయమై రక్త స్రావం జరుగుతున్నప్పటికీ తల్లి వానరం బిడ్డకు పాలు ఇవ్వడాన్ని చూపరులను కట్టిపడేసింది.గాయంతో తల్లి కోతి నిస్సహాయంగా ఒక దగ్గర కూర్చోగా దాని చుట్టూ తిరుగుతూ, పాలు తాగే ప్రయత్నం చేస్తున్న పిల్లను చూసిన స్థానికులు కదలిపోయారు.

కల్లూరు పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయం సమీపంలో మూడు రోజుల కిందట ఒక కోతి తలకు దెబ్బ తగిలి రక్త మోడింది. తలకు తీవ్ర గాయమై ప్రాణాపాయ స్థితిలోనూ వానరం తన బిడ్డకు పాలు ఇవ్వడం మానలేదు . ఇదంతా తెలియని పిల్ల మాత్రం ఎప్పటి లాగే తల్లిని పట్టుకుని వేలాడుతోంది. మూడు రోజులుగా బాధను భరిస్తూనే అమ్మ ప్రేమను పంచిన తీరు చూపరులను కలచివేసింది. స్థానిక యువకులు కొందరు తీవ్రంగా గాయపడిన కోతిని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us