Viral: ఒకే వ్యక్తికి 658 సిమ్‌కార్డులు.. ఆరా తీస్తే పోలీసులే షాక్..! వీడియో..
ఒక్క సిమ్ కార్డు తీసుకోవాలంటే సవాలక్ష క్వశ్చాన్లు, ఎంక్వేరీలు ఉంటాయి. అలాంటిది.. విజయవాడలో ఒకే వ్యక్తికి వందల సంఖ్యలో సిమ్ కార్డులు ఉన్నాయి. గుణదలలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు జారీ అయ్యాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీస్ కమీషనర్ కాంతిరాణా విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.
ఒక్క సిమ్ కార్డు తీసుకోవాలంటే సవాలక్ష క్వశ్చాన్లు, ఎంక్వేరీలు ఉంటాయి. అలాంటిది.. విజయవాడలో ఒకే వ్యక్తికి వందల సంఖ్యలో సిమ్ కార్డులు ఉన్నాయి. గుణదలలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు జారీ అయ్యాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీస్ కమీషనర్ కాంతిరాణా విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఒకే ఫొటోతో ఓ నెట్‌వర్క్ సంస్థకు చెందిన 658 సిమ్‌లను అమ్మినట్లు గుర్తించారు పోలీసులు. సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు ఈ సిమ్ కార్డుల్ని రిజిస్టర్ చేసినట్లు తేల్చారు. ఇదే తరహాలో అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు సిమ్‌కార్డులు నకిలీ పత్రాలతో జారీ చేసినట్లు గుర్తించారు. సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలికమ్యునికేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఓ టూల్ కిట్ ద్వారా ఇదంతా బయటపడింది. ఇక ఈ సిమ్‌లు ఎక్కడికి వెళ్లాయి.. ఎవరు వినియోగిస్తున్నారన్న పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. ఒకే వ్యక్తి పేరుతో ఇన్ని సిమ్‌కార్డులు ఉండటం కలకలంరేపుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...