Viral Video: టీమ్ వర్క్ అంటే ఇది కదా.. వీడియో పూర్తిగా చూస్తే.. వావ్ అనాల్సిందే..

Viral Video: టీమ్ వర్క్ అంటే ఇది కదా.. వీడియో పూర్తిగా చూస్తే.. వావ్ అనాల్సిందే..

Ram Naramaneni

|

Updated on: Aug 12, 2023 | 4:13 PM

చీమలు తమను మించిన బరువను మోయగలవు ఈ విషయం తెలిసిందే. అంతేకాదు అవి మనుషులకు కొన్ని పాఠాలు నేర్పించగలవు. అదెలా అంటారా..? అయితే ఈ వీడియోను మీరు చూడాల్సిందే. టీమ్ వర్క్ అంటే ఏంటనేది చేసి చూపించాయి ఈ చీమలు. చనిపోయిన బల్లిని.. ఆహారంగా మార్చుకునేందుకు.. తమ నివాస ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఆ చీమలు చాలా సమయస్పూర్తి, తెలివితేటలు, సమిష్టి కృషిని ప్రదర్శించాయి. అనేక అడ్డంకులను దాటి గమ్య స్థానానికి చేరకున్నాయి. వీడియో చూసేద్దాం పదండి

టీమ్ వర్క్ అనేది ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయడానికి కావాల్సిన ప్రధాన సాధనం. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేసే షార్ప్ బ్రెయిన్ మీకు ఉండి ఉండొచ్చు. కానీ ఆ ఐడియాను విజయవంతంగా అమలు చేయాలంటే.. స్కిల్స్ ఉన్న టీమ్ అయితే పక్కాగా ఉండాలి. అప్పుడే సరైన ప్రూట్స్ లభిస్తాయి. తాజాగా మీ ముందుకు ఓ వీడియోను తీసుకొచ్చాం. అది చూస్తే మీరు పక్కాగా వావ్ అంటారు. సహజంగా చీమలు తమకంటే అనేక రెట్లు బరువును మోస్తాయన్న అన్న విషయం మీకు తెలిసిందే. దీనిపై అందరికీ అవగాహన ఉంది. లైవ్‌గానూ ఈ అంశాన్ని చాలామంది విట్‌నెస్ చేసి ఉంటారు. తాజా వీడియోలో ఓ చనిపోయిన బల్లిని లాక్కువెళ్లేందుకు చీమలు కలిసి కట్టుగా పనిచేసి విజయం సాధించాయి. చిన్న చిన్న పురుగులను, పంచదార, ఇతర తిను బండారాలను అవి తీసుకెళ్లడం మీరు చూసే ఉంటారు. ఇక్కడ చనిపోయింది బల్లి. దాన్ని పూల కుండీ కింద నుంచి పూల కుండీ లోనికి తీసుకెళ్లడం వాటి టాస్క్. అవి మధ్యలో వచ్చిన అడ్డంకులను సైతం దాటుకుని ఎలా తీసుకువెళ్లాయో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Published on: Aug 12, 2023 04:09 PM