ఇంటిముందు ప్రత్యక్షమైన అరుదైన నక్షత్ర తాబేలు.. అంతా షాక్!

ఇంటిముందు ప్రత్యక్షమైన అరుదైన నక్షత్ర తాబేలు.. అంతా షాక్!

Phani CH

|

Updated on: Aug 12, 2023 | 9:46 AM

అదృష్టం అనే పేరు చెబితే చాలు కొందరు భారీగా ఖర్చు చేసి మరీ ఆయా వస్తువులను సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాబేళ్లపై కొందరకి కోట్లు కుమ్మరిస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లా కల్లూరులో ఓ రిటైర్డ్ అధికారి ఇంటికి అదృష్టం నడుచుకుంటూ వచ్చింది. NSP కాలనీలోని ఊటుకూరు శంకర్ రావు అనే రిటైర్డ్ టీచర్ ఇంటి ఆవరణలో ఉదయాన్నే నక్షత్ర తాబేలు కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు.. కానీ ఇంటి వాకిలీలో ప్రత్యక్షమైంది.

అదృష్టం అనే పేరు చెబితే చాలు కొందరు భారీగా ఖర్చు చేసి మరీ ఆయా వస్తువులను సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాబేళ్లపై కొందరకి కోట్లు కుమ్మరిస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లా కల్లూరులో ఓ రిటైర్డ్ అధికారి ఇంటికి అదృష్టం నడుచుకుంటూ వచ్చింది. NSP కాలనీలోని ఊటుకూరు శంకర్ రావు అనే రిటైర్డ్ టీచర్ ఇంటి ఆవరణలో ఉదయాన్నే నక్షత్ర తాబేలు కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు.. కానీ ఇంటి వాకిలీలో ప్రత్యక్షమైంది. అంతరించిపోతున్న అరుదైన నక్షత్ర జాతి తాబేలు కనిపించడంతో.. స్వయంగా లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని ఆ కుటుంబం సంబరపడిపోయింది. తమ ఇంటి ఆవరణలోకి నక్షత్ర తాబేలు వచ్చిన విషయం అమెరికాలో ఉంటున్న తన కుమారుడకి తల్లిదండ్రులు సమాచారమిచ్చారు. అతను వెంటనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు ట్యాగ్ చేశారు. దీంతో ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారుల ఆదేశాల మేరకు శంకర్ రావు నుంచి నక్షత్ర తాబేలును ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. నిజాయితీగా అధికారులకు సమాచారం ఇచ్చి.. తాబేలును అప్పజెప్పినందుకు శంకర్ రావు కుటుంబసభ్యులను ఫారెస్ట్ అధికారులు అభినందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుండెకు మూడు సర్జరీలు.. అయినా గిన్నిస్‌ రికార్డు సొంతం

Naa Anveshana: వైజాగ్ యూట్యూబర్ అన్వేష్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తెలివైన దొంగ.. కుక్కకు ముద్దుపెట్టి..సైకిల్‌ లేపేసాడు

పిల్లి.. పులిగా మారడాన్ని మీరు చూశారా.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్‌ వీడియో

తలకు హెల్మెట్ వేసుకుంటేనే ఆఫీస్‌కి ఎంట్రీ !!