Cat Viral: పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్ ఐడియా.. వీడియో వైరల్.!
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు చూసి అయ్యో అనుకుంటూ వెళ్లిపోతారే తప్ప స్పందించి ముందుకు వచ్చి సాయం చేసేవారు చాలా తక్కువ. ఇక మూగజీవులు అలాంటి పరిస్థితిలో చిక్కుకుంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. ఆ సమయంలో ఎవరైనా జంతు ప్రేమికులు అక్కడ ఉంటే వాటిని కాపాడే ప్రయత్నం చేస్తారు. అది వేరే విషయం. కానీ సామాన్యులెవరూ పట్టించుకోరు.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు చూసి అయ్యో అనుకుంటూ వెళ్లిపోతారే తప్ప స్పందించి ముందుకు వచ్చి సాయం చేసేవారు చాలా తక్కువ. ఇక మూగజీవులు అలాంటి పరిస్థితిలో చిక్కుకుంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. ఆ సమయంలో ఎవరైనా జంతు ప్రేమికులు అక్కడ ఉంటే వాటిని కాపాడే ప్రయత్నం చేస్తారు. అది వేరే విషయం. కానీ సామాన్యులెవరూ పట్టించుకోరు. కానీ ఓ యువకుడు మాత్రం ప్రమాదంలో చిక్కుకుని ప్రాణ భయంతో అల్లాడుతున్న ఓ పిల్లిని ఎంతో చాకచక్యంగా కాపాడి అందరి ప్రశంసలు పొందతున్నాడు. మూసీ వంతెన మధ్యలో చిక్కుకున్న పిల్లిని కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.
హైదరాబాద్ నగరం పాతబస్తీలో పిల్లిని కాపాడడానికి ఓ యువకుడు చేసిన సాహసం అంతా ఇంతా కాదు. సుమారు 5 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఎట్టకేలకు ఆ పిల్లిని కాపాడాడు. అసలు ఆ సమయంలో అతను అక్కడ ఉండడం, ఆ సమస్యను గుర్తించడం, అతను స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మూసీ వంతెన మధ్యలో ఓ పిల్లి పైకి ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎటు పోవాలో తెలియక బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. చుట్టూ చూస్తే మొత్తం నీరు. ఆ మూగజీవికి ఏం చేయాలో తోచలేదు. మూసీ వంతెన ఒడ్డున భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ సమయంలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి తిరిగివెళ్లే సమయంలో అక్కడికి చేరుకున్న మహ్మద్ మజార్ అనే యువకుడి కంట్లో పడింది ఆ పిల్లి. దాని పరిస్థితి అర్థం చేసుకున్న మజార్ దానిని ఎలాగైనా కాపాడాలనుకున్నారు. వెంటనే తన ఇంట్లో ఉన్న ఒక బోనును తీసుకొచ్చాడు. ఆ బోనులో పిల్లికి ఇష్టమైన ఆహారం పెట్టి ఓ తాడు సహాయంతో కిందికి దింపాడు. చాలాసేపు అక్కడే వేచి చూశాడు. సుమారు 5 గంటల పాటు పిల్లి అటు ఇటు పరుగులు పెడుతూ ఎట్టకేలకు ఆ బోనులోకి దూరింది. అనంతరం ఆ పిల్లని తన ఇంటికి తీసుకెళ్లి ఫుడ్ పెట్టి తన ఇంటి బయట వదిలేశాడు. వెంటనే అది బోను నుంచి బయటికి వచ్చి పరుగులు పెడుతూ పారిపోయింది. ఓ మూగజీవి పట్ల అతను చూపించిన జాలి, దయ పట్ల ఆ యువకుడిని అందరూ అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.