Mahanandi Mystery: మహానంది ఆలయంలో ఇప్పటికి అంతుచిక్కని మిస్టరీ.. కోనేరులో ఎలా..?

|

Oct 08, 2023 | 5:05 PM

కర్నూలు జిల్లాలో ని మహానంది పుణ్యక్షేత్రంలో కోనేరు ఓ అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే కాలాలతో సబంధం లేకుండా ఈ కోనేరులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఎంతో స్వచ్ఛమైన నీటితో కోనేరు ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. అంతేకాదు ఆ కోనేరు చుట్టుపక్కల వందలాది ఎకరాలకు సాగునీరును అందిస్తోంది. కానీ ఈ కోనేరులోకి నీరు ఎక్కడినుంచి వస్తుందనేది పెద్ద మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించేందుకు కోనేరుపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుపుతున్నారు.

కర్నూలు జిల్లాలో ని మహానంది పుణ్యక్షేత్రంలో కోనేరు ఓ అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే కాలాలతో సబంధం లేకుండా ఈ కోనేరులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఎంతో స్వచ్ఛమైన నీటితో కోనేరు ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. అంతేకాదు ఆ కోనేరు చుట్టుపక్కల వందలాది ఎకరాలకు సాగునీరును అందిస్తోంది. కానీ ఈ కోనేరులోకి నీరు ఎక్కడినుంచి వస్తుందనేది పెద్ద మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించేందుకు కోనేరుపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుపుతున్నారు. ఎండాకాలం, వానాకాలంలో కూడా ఈ కోనేరులో నీటిమట్టం ఒకేలా ఉంటుంది. ఇందులోకి ఐదు దారలుగా వచ్చి పడే నీరు ఎక్కడినుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ కోనేరులో స్నానమాచరిస్తే అనారోగ్యాలు నయమవుతాయనే ప్రచారం కూడా ఉంది. అందుకే దేశం నలుమూలలనుంచి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించేందుకు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారు. మహానంది క్షేత్రాన్ని తీర్థ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఆలయంలోని శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం క్రింది నుంచి నీరు ప్రవహిస్తూ రుద్రగుండం కొనేరులోకి వస్తుంది. అక్కడి నుంచి బ్రహ్మ,విష్ణు గుండం కొనేరులోకి వస్తుంది. ఈ నీరు మహానంది చుట్డుప్రక్కల గల వందల ఎకరాల పంటపొలాలను సస్యశ్యామలం చేస్తోంది. ఈ క్షేత్రంలో ఎక్కడ తవ్వినా 10 అడుగుల లోతులోనే జలం ఉబికి వస్తుంది. అయితే మహానంది క్షేత్రం కోనేరులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది అంతుపట్టని రహస్యంగా స్థానికులు చెప్పుకుంటారు. ఈ కోనేరులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేందుకు గతంలో అనేక మంది చాలా ప్రయత్నాలు చేశారు కాని ఎలాంటి ఆధారాలు లభించలేదు. కోనేరులో ఉండే నీరు ఎంతో స్వచ్చంగా ఉండటంతో పాటు నీటిలో ఔషదగుణాలు కూడా ఉన్నాయనేది చరిత్రకారులు చెబుతున్న మాట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..