Viral Video: బావిలో పడిన చిరుత.. ఆ గ్రామస్తులు ఏంచేశారో తెలుసా..! వీడియో.
ఇటీవల వన్యమృగాలు తరచూ జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఆహారం, నీరు ఇలా వాటి కనీస అవసరాలు అడవుల్లో కరువవడంతో గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కోసారి వన్యమృగాలు కూడా ప్రమాదాలబారిన పడుతున్నాయి.
కర్నాటకలోని ఓ ప్రాంతంలో అడవి పక్కనే ఉండే ఓ గ్రామంలోకి వచ్చిన చిరుత బావిలో పడిపోయింది. బావిలో చిరుతను గమనించిన గ్రామస్తులు దాన్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. మరోవైపు స్థానిక అధికారులకూ సమాచారమిచ్చారు. ఆ చిరుతను బయటకు తెచ్చేందుకు వారు వేసిన ప్లాన్ వర్కవుట్ అయింది. చిరుత క్షేమంగా బయటకు వచ్చింది. తనదారిన అడవిలోకి వెళ్లిపోయింది. ఇంతకీ ఆ గ్రామస్తులు ఏం చేశారో తెలుసా? చిరుతను బయటకు రప్పించేందుకు వారు ఓ నిచ్చెన, కాగడాను ఉపయోగించారు. ముందుగా నిచ్చెనను బావిలో దింపారు. ఆ తర్వాత ఓ కాగడాకి అగ్గి వెలిగించి బావిలోకి పంపి చిరుతను భయపెట్టారు. అంతే అగ్గి కాగడా తన దగ్గరకు రాగానే భయపడిన చిరుత ఆ కంగారులో గబగబా నిచ్చెన ఎక్కి పైకి వచ్చేసింది. మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోకి పరుగెత్తింది. చిరుత క్షేమంగా బయటపడడంతో గ్రామస్తులు, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుతను కాపాడిన గ్రామస్తులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే మరికొందరు మాత్రం నిప్పుతో పులిని బెదిరించడం తగదని..గాయపడే అవకాశం ఉందని హితబోధ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..