ఒక వ్యక్తి చనిపోతే.. ఆ వ్యక్తి అంత్యక్రియల్లో మహా అంటే పదుల సంఖ్యలో జనం పాల్గొంటారు. మహానీయులైతే వందల్లో హాజరవుతారు. కానీ ఓ సామాన్య వ్యక్తి చనిపోతే.. పదులు.. వందలు.. వేలు ఇలా జనం తండోప తండాలు తరలివచ్చి కడసారి వీడ్కోలు పలికారు. ఆ దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది. జంగారెడ్డి గూడెంలోని ముత్రాసు కాలనీకి చెందిన కేతిరెడ్డి అప్పలనాయుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలు ఇద్దరికి వివాహాలు అయ్యాయి. కూలి పని చేస్తూ జీవితాన్ని ప్రారంభించిన అప్పలనాయుడు బిల్డర్‌గా మారారు. తాను చేసే పనిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేశాడు. వేలాది మందిని చేరదీసి.. ఉపాధి అవకాశాలు కల్పించాడు. ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసి మంచి మనసును చాటుకుంటూ అందరికీ చేరువయ్యాడు. అయితే జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై మోటార్‌సైకిల్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అప్పలనాయుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో అతన్ని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అప్పలనాయుడి మృతదేహన్ని చూసి తల్లడిల్లిపోయారు. అప్పలనాయుడు మోటార్ సైకిల్‌పై జాతీయ ప్రధాన రహదారిపైకి వస్తున్నాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న కారు అప్పలనాయుడు మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి ఆగకుండా సమీపంలో ఉన్న బడ్డీ కొట్టులోకి దూసుకువెళ్లి పల్టీ కొట్టింది. దీంతో బడ్డీ కొట్టు ధ్వంసమై అందులో ఉన్న నలుగురితో పాటు అప్పలనాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అప్పలనాయుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పలనాయుడు మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అప్పలనాయుడిని అంతిమ సంస్కారాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం కడసారి ఘనంగా నివాళిలర్పించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..