Viral Video: ఇంటిముందు వంటచేస్తున్న మహిళపై ఒక్కసారిగా మీదకు దూకిన కింగ్ కోబ్రా..!
సాధారణంగా పాములు అంటే అందరికీ భయమే. కొందరు పాము పేరు చెబితేనే వణికిపోతారు. మరికొందరు చిన్న పామును చూడగానే పరుగులంకించుకుంటారు. అలాంటిది ఓ కింగ్ కోబ్రా కళ్లముందు ప్రత్యక్షమైతే.. పరిస్థితి ఏంటి? తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది ఓ మహిళకి. తన ఇంటి వరండాలో వంట చేసుకుంటున్న మహిళ వద్దకు ఊహించని విధంగా ఓ పెద్ద కింగ్ కోబ్రా దూసుకొచ్చింది.
సాధారణంగా పాములు అంటే అందరికీ భయమే. కొందరు పాము పేరు చెబితేనే వణికిపోతారు. మరికొందరు చిన్న పామును చూడగానే పరుగులంకించుకుంటారు. అలాంటిది ఓ కింగ్ కోబ్రా కళ్లముందు ప్రత్యక్షమైతే.. పరిస్థితి ఏంటి? తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది ఓ మహిళకి. తన ఇంటి వరండాలో వంట చేసుకుంటున్న మహిళ వద్దకు ఊహించని విధంగా ఓ పెద్ద కింగ్ కోబ్రా దూసుకొచ్చింది. మహిళ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే నిర్దాక్షిణ్యంగా మహిళ ప్రాణాలు కోల్పోయేది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మహిళకు భూమిపైన ఇంకా నూకలు ఉన్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఘటన థాయ్‌లాండ్‌లో జరిగినట్టు తెలుస్తోంది. ఓ మహిళ తన ఇంటి వరండాలో వంట చేస్తూ ఉంది. కుర్చీలో కూర్చుని ఏదో పిండి కలుపుకుంటూ ఉంది. ఇంతలో ఆ ఇంటిముందు ఉన్న చెట్లలోనుంచి ఓ పెద్ద కింగ్ కోబ్రా నేరుగా మహిళ ఇంటి వైపు దూసుకొచ్చింది. మహిళ కూర్చున్న కుర్చీ కిందకురాగానే కాలుకి ఏదో తగిలినట్టు అనిపించి మహళ ఏంటా అని పక్కకు చూడగానే అంత పెద్ద పామును చూసి ఒక్కసారిగా భయపడింది. వెంటనే అక్కడ్నుంచి లేచి పారిపోయే ప్రయత్నంలో ఆమె కాలు ఆ పాముకి తాకింది. వెంటనే ఆ పాము మహిళను కాటు వేయబోయింది. అప్పటికే అలెర్ట్ అయిన మహిళ.. పాము కాటు నుంచి తెలివిగా తప్పించుకుని అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ పక్కకు వెళ్లిపోయింది. మరోవైపు పాము కూడా అక్కడి నుంచి రోడ్డు మీదుగా పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

