Woman Delivery: రోడ్డుపై భార్యకు డెలివరీ చేసిన భర్త.. ఆ తరువాత అతను చేసిన పనికి అంతా షాక్‌.. బొడ్డుతాడు సెల్‌ఫోన్‌ ఛార్జర్‌తో..

భార్య నిండు గర్భిణీ.. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న ఆ ఇంట్లోకి మరొకరిని ఆహ్వానించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూశారు. వారొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది.

Woman Delivery:  రోడ్డుపై భార్యకు డెలివరీ చేసిన భర్త.. ఆ తరువాత అతను చేసిన పనికి అంతా షాక్‌.. బొడ్డుతాడు సెల్‌ఫోన్‌ ఛార్జర్‌తో..

|

Updated on: Sep 24, 2022 | 1:31 PM


భార్య నిండు గర్భిణీ.. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న ఆ ఇంట్లోకి మరొకరిని ఆహ్వానించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూశారు. వారొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. భార్యకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన భర్త ఆమెను కారులో ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. హాస్పిటల్ కు వెళ్తుండగా మధ్యలోనే ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. ఈ క్రమంలో ఆ భర్త చేసిన పనికి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.అమెరికాలోని ఇండియానా ప్రాంతానికి చెందిన స్టీఫెన్‌, ఎమిలీ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం కాగా.. మరోసారి ఎమిలీ గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండటంతో సెప్టెంబర్‌ 12న పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. అంబులెన్స్ లో తీసుకువెళ్తే ఆలస్యమవుతుందని భావించిన స్టీఫెన్ ఎమిలీని కారులో ఎక్కించుకుని హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఎమిలీకి నొప్పులు అధికమయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్టీఫెన్ ఆమెకు ప్రసవం చేశాడు. డెలివరీ చేసిన తర్వాత బిడ్డకు బొడ్డ తాడు‌ కత్తిరించలేదు. రెండు ఐఫోన్ ఛార్జింగ్ వైర్లతో బొడ్డు తాడును గట్టిగా కట్టేశాడు. ఇక ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు తల్లీబిడ్డలకు వైద్య పరీక్షలు చేసి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉంటే తన ప్రసవ సమయంలో జరిగిన షాకింగ్ విషయం గురించి ఎమిలీ తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. తన భర్త ఛార్జింగ్ వైర్లతో బిడ్డ బొడ్డు తాడును కట్టడం చూసి భయాందోళనకు లోనయ్యానని చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

 

Follow us