AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pet Dog viral video: లిఫ్ట్‌లో వెళ్తున్న బాలుడు, ఓమహిళ, పెంపుడు శునకం.. ఒక్కసారిగా ఊహించని షాక్..

Pet Dog viral video: లిఫ్ట్‌లో వెళ్తున్న బాలుడు, ఓమహిళ, పెంపుడు శునకం.. ఒక్కసారిగా ఊహించని షాక్..

Anil kumar poka
|

Updated on: Sep 11, 2022 | 9:52 AM

Share

లిఫ్ట్‌లో వెళ్తుండగా ఓ బాలుడిని పెంపుడు శునకం కరిచింది. అంతా చూస్తున్నా ఏమీ పట్టనట్లు ఉండిపోయింది ఆ పెంపుడు శునకం యజమాని. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు..


లిఫ్ట్‌లో వెళ్తుండగా ఓ బాలుడిని పెంపుడు శునకం కరిచింది. అంతా చూస్తున్నా ఏమీ పట్టనట్లు ఉండిపోయింది ఆ పెంపుడు శునకం యజమాని. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో చోటు చేసుకుంది. బాలుడిని శునకం కరుస్తున్న దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. సదరు వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఓ బాలుడు, మరో మహిళ, ఆమె పెంపుడు కుక్కతో కలిసి లిఫ్ట్‌లో వెళ్తున్నారు. బాలుడు లిఫ్ట్ డోర్ వైపు వెళ్లగానే.. కుక్క ఒక్కసారిగా ఆ బాలుడి కాలు పట్టుకొని కరిచేసింది. నొప్పితో ఆ బాలుడు విలవిలలాడిపోయాడు. ఇదంతా చూస్తున్నా.. ఏమీ జరగనట్లు ఆ మహిళ మౌనంగా ఉండిపోయింది. నొప్పితో బాధపడుతున్నా ఆ బాలుడిని కనీసం ఓదర్చలేదు. తన ఫ్లోర్ రాగానే లిఫ్ట్ దిగి వెళ్లిపోయింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు పెంపుడు శునకం యజమానిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చార్మ్స్ క్యాజిల్ సొసైటీలో సెప్టెంబర్‌ 5 సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 11, 2022 09:52 AM