Viral Video: మొసలికి ఆహారం పెడదామనుకుంది.. కానీ అంతలోనే.. ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో..

Viral Video: మాంసానికి రుచి మరిగిన మొసలి మనిషి కనిపిస్తే వదిలి పెడుతుందా.. అమాంతం నోట కరుచుకొని నమియేలదు.! అయితే జూలలో పెంచే మొసళ్లు అంత ప్రమాదకరం కావని, వాటికి ఇచ్చే ట్రైనింగ్‌..

Viral Video: మొసలికి ఆహారం పెడదామనుకుంది.. కానీ అంతలోనే.. ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 04, 2022 | 7:12 PM

Viral Video: మాంసానికి రుచి మరిగిన మొసలి మనిషి కనిపిస్తే వదిలి పెడుతుందా.. అమాంతం నోట కరుచుకొని నమియేలదు.! అయితే జూలలో పెంచే మొసళ్లు అంత ప్రమాదకరం కావని, వాటికి ఇచ్చే ట్రైనింగ్‌ వల్ల అవి దాడి చేయవని భావిస్తుంటాం. అయితే మొసలి జూలో ఉన్నా, బయట ఉన్నా అది సహజ గుణమైన వేట మాత్రం మారదు. మనిషి కనిపిస్తే అటాక్‌ చేయడమే దాని నైజం. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో మొసలి స్వభావం ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోంది. ఒళ్లు గగుర్లు పొడిచేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఓ జూలో మొసలిని ప్రదర్శనకు ఉంచారు. అదే సమయంలో మొసలి బాధ్యతలు చూసుకుంటున్న ఓ మహిళా ట్రైయినర్‌ దానికి చేతితో ఏదో ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ఆ మొసలి మాత్రం ఆహారంతో పాటు వెంటనే ఆ మహిళ చేతిని కూడా నోటిన కరుచుకొని ఒక్కసారిగా నీటిలోకి లాగేసింది. అంతటితో ఆగని ఆ మొసలి సదరు మహిళను గిర్రున తిప్పేసింది. మహిళ మొసలి నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా మొసలి మాత్రం వదల్లేదు.

దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి మొసలి నుంచి సదరు మహిళను తప్పించేందుకు ప్రయత్నించాడు. అతన్ని కూడా కొద్దిసేపు ఓ ఆటాడుకున్న మొసలిని ఏదోలాగా.. అదుపులోకి తెచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. దీంతో సదరు మహిళా బతుకు జీవుడా అన్నట్లు ఊపిరిపీల్చుకుంది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒళ్లు గగుర్లు పొడిచేలా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి..

Also Read: Andhra Pradesh GO.02: సర్పంచులకు గుడ్‌న్యూస్.. జీవో నం.2 వెనక్కు తీసుకున్న ఏపీ సర్కార్!

Electric Scooter: ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొంటున్నారా.. కచ్చితంగా ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి..!

Lift Accident: సిద్ధిపేట జిల్లాలో తెగిపడ్డ ఆర్‌వీఎం ఆసుపత్రి లిఫ్టు.. 20మందికి గాయాలు, ముగ్గురికి సీరియస్!