Cat Pets: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పిల్లులను పెంచుతున్న దంపతులు..
మనలో చాల మంది పిల్లిని అపశకునంగా భావిస్తుంటారు. పెంపుడు జంతువులుగా శునకాలను మాత్రమే పెంచుకుంటారు. కొందరు జంతు ప్రేమికులు మాత్రం ఇంటిలో ఒక పిల్లిని మాత్రం పెంచుకుంటారు. కానీ ఓ కుటుంబం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 పిల్లులను పెంచుతున్నారు.
యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన శ్రీకాంత్, దుర్గ దంపతులు.. నిత్యం తమ పిల్లలతో కాకుండా పిల్లులతో బిజీగా ఉంటున్నారు. అసలు విషయానికి వస్తే.. తల్లి చనిపోయిన పిల్లి కూన పాల కోసం ఏడుస్తూ పంది వద్ద పాలు తాగడం వీరు కొడుకు కృష్ణవంశీ కంటపడింది. వెంటనే తల్లిదండ్రులకు నచ్చచెప్పి పాల కోసం తపిస్తున్న పిల్లి కూనను ఇంటికి తీసుకువచ్చి సాకడం మొదలుపెట్టారు. ఆ పిల్లి కూన పెరిగి పెద్దదై.. దాని పిల్లలు, పిల్లలకు పిల్లలు.. మొత్తం 20 వరకు సంతానం పెరిగింది. ఇలా ఎనిమిదేళ్లలో వృద్ధి చెందిన పిల్లులు ఆ ఇంటిలో సందడి చేస్తున్నాయి. ఇంటికి తీసుకువచ్చి పెంచిన పిల్లులకు రకరకాల పేర్లు పెట్టుకున్నారు. పిల్లుల ఆలనా పాలనా చూస్తున్న వీరు.. వాటికి క్రమశిక్షణ కూడా నేర్పించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...