Constable: ఆనందంగా డాన్స్ చేస్తూ అనంతలోకాలకు.! ఒక్కసారిగా కుప్పకూలిన కానిస్టేబుల్.
ఇటీవల మాయదారి గుండెపోటు మహమ్మారిలా తయారైంది. వయసుతో సంబంధం లేకుండా.. సమయం సందర్భం లేకుండా ఎటాక్ చేస్తోంది. పసివాళ్లనుంచి పండు ముదుసలి వరకూ ప్రాణాలు హరిస్తోంది. అయితే అలాంటి మరణాల వెనుక.. వైద్యపరంగా ఆరోగ్య సమస్యలూ ఉండొచ్చనే అభిప్రాయమూ నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. తాజాగా ఢిల్లీలో ఓ యువ పోలీస్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.

ఢిల్లీ రూప్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్.. స్టేషన్ హౌస్ అధికారి బదిలీ కావడంతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా రవికుమార్ పలు పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. అతడి సహచరులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. రవికుమార్ చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు తమతో సరదాగా ఉన్న కానిస్టేబుల్ మృతిచెందడంతో ఆయన మిత్రులు షాక్‌కు గురయ్యారు. హెడ్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన రవికుమార్ 2010లో ఢిల్లీ పోలీస్ విభాగంలో చేరాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 45 రోజుల క్రితమే రవికుమార్ యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.