మకరజ్యోతి దర్శనంతో శబరిగిరులు అయ్యప్ప శరణుఘోషతో పులకించాయి. ఎరుమేలి భక్తి పారవశ్యంతో ఉప్పొంగింది. పంబాతీరం పరవశించిపోయింది. భక్తసంద్రం పూనకాలతో ఊగిపోయింది.మకరజ్యోతిని వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములు, భక్తులతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది.