మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ తీరం భక్తకోటితో నిండిపోయింది. కనుచూపుమేర ఎటుచూసినా భక్తుల పుణ్యస్నానాలే కనిపిస్తున్నాయి. బుధవారం మూడో రోజు కోట్లాది మంది తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.