King Cobra: స్నేక్ క్యాచర్‌కే చెమటలు పట్టించిన రాచనాగు.. నడిరోడ్డుపై పడగవిప్పి బుసలు కొడుతూ..
కారణాలు ఏవైనా ఇటీవల వనాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పాములు, క్రూర జంతువులు, కోతులు ఇలా అనేకం ప్రజల మధ్యకు వస్తున్నాయి.
కారణాలు ఏవైనా ఇటీవల వనాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పాములు, క్రూర జంతువులు, కోతులు ఇలా అనేకం ప్రజల మధ్యకు వస్తున్నాయి. వీటిలో పాముల బెడద ఎక్కువగా కనిపిస్తుంది. భారీ వర్షాలు, వరదలతో ఆవాసం కోల్పోయి పాములు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. వాటిని స్నేక్ క్యాచర్స్ పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రోడ్డుపై స్నేక్ క్యాచర్ ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకుంటున్నాడు. అది చూడ్డానికి చాలా పెద్దగా భయంకరంగా ఉంది. దానిని ఎంతో జాగ్రత్తగా పట్టుకోడానికి అతను ట్రై చేస్తున్నాడు. ఆగ్రహంతో ఉన్న ఆ కోబ్రాను శాంతింప చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది రెండు అడుగుల ఎత్తువరకు పైకి లేచి పడగ విప్పి అతన్ని కాటువేసే ఛాన్స్ కోసం చూస్తుంది. అతను దానిని నెమ్మదిగా పట్టుకుని పైకి లేపాడు. అది ఒక్కసారిగా స్నేక్ క్యాచర్‌పై ఎటాక్ చేసింది. అయితే అతను తృటిలో తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ షాకింగ్ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. వేలాదిగా లైక్ చేస్తూ.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. పాములతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. కొందరు మాత్రం స్నేక్ క్యాచర్ కోబ్రాను పట్టుకునే సమయంలో దానిని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..