Beggar Trending Look: ఢిల్లీ వీధుల్లో బిచ్చగాడు.. ప్రొఫెషనల్ మోడల్స్‌కే సవాలు విసురుతున్న ఫోటో.. బాలీవుడ్ హీరోలా..
దేశరాజాధాని ఢిల్లీలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. మహానగరంలో ఎంతో బిజీగా ఉండే ప్రాంతంలో వాహనాలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి. ఇంతలో
దేశరాజాధాని ఢిల్లీలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. మహానగరంలో ఎంతో బిజీగా ఉండే ప్రాంతంలో వాహనాలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి. ఇంతలో ఓ వ్యక్తి ఆ వాహనాల మధ్యలోంచి వెళుతున్నాడు. నలుపు రంగు టీషర్ట్, కళ్లకు నల్ల కళ్లజోడు పెట్టుకుని.. మంచి హెయిర్ స్టైల్ తో ఉన్నాడు. అతన్ని చూడగానే ఎవరో మోడలో, సినిమా స్టారో అనుకోకమానరు. కానీ కిందికి చూస్తే.. అతనికి ఒక కాలు దెబ్బతిని, చేతి కర్రలతో నడుస్తున్నాడు. నిజానికి అతనొక భిక్షగాడు. అతని పరిస్థితికి జాలిపడినా.. ఆ వ్యక్తి రూపం, స్టైల్ చూసి చాలా జనం ఫిదా అయిపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కవాల్ జిత్ సింగ్ బేడీ అనే నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటోను ‘ఢిల్లీ బెగ్గర్స్’ క్యాప్షన్ తో పోస్ట్ చేశారు. దాంతో అది వైరల్ గా మారింది. వేలమంది ఈ వీడియోను లైక్ చేస్తూ రీ ట్వీట్లు చేస్తున్నారు. అతను భిక్షగాడు కాకపోవచ్చని కొందరు అంటే.. భిక్షగాడే అయి ఉంటాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఇవన్నీ చూసిన సదరు నెటిజన్.. తన కారులో ఉన్న డ్యాష్ క్యామ్ ఫుటేజీలోని వీడియోను షేర్ చేశారు. అతను నిజంగానే భిక్షగాడు అని.. అతడికి ఒక కాలు విరిగి, కర్రలతో నడుస్తున్నాడని తెలిపారు. ఇతను అచ్చం బాలీవుడ్ హీరోలా ఉన్నాడని, ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచి ఫొటోలు పెట్టి ఉంటే మంచి ఫాలోయింగ్ వచ్చి ఉండేదంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

