Baby Horse: కాలం ఎంత కసాయిదో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు.. బస్సుపై బొమ్మను చూసి తల్లి అనుకొని పిల్ల గుర్రం..

Updated on: Sep 19, 2022 | 9:58 AM

తల్లి ప్రేమ వర్ణించలేనిది. పిల్లలకు అమ్మను మించిన దైవం లేదు.. అంతకు మించిన రక్షణ లేదు. అది మనుషులకైనా, పశుపక్ష్యాదులకైనా.. మాతృప్రేమ ఒకటే. తన బిడ్డకు ఎలాంటి అపాయం..


తల్లి ప్రేమ వర్ణించలేనిది. పిల్లలకు అమ్మను మించిన దైవం లేదు.. అంతకు మించిన రక్షణ లేదు. అది మనుషులకైనా, పశుపక్ష్యాదులకైనా.. మాతృప్రేమ ఒకటే. తన బిడ్డకు ఎలాంటి అపాయం జరుగకుండా రక్షించుకుంటుంది. బిడ్డ కూడా అమ్మ ప్రేమకు అలాగే బానిస అవుతారు. ఒక్క క్షణం తమ తల్లి కనిపించకపోతే తల్లడిల్లిపోతారు. తాజాగా ఇలాంటి తల్లి, బిడ్డల ప్రేమకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తల్లి కోసం ఆ బిడ్డ పడుతున్న తపన చూసి ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. అసలేం జరిగిందంటే..తమిళనాడు కోయంబత్తూరులో తల్లిగుర్రం కోసం పిల్ల గుర్రం పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. బత్తిశ్వర ఆలయం సమీపంలో వారం క్రితం తల్లి గుర్రం తప్పిపోయింది. దీంతో పిల్లగుర్రం తన తల్లి కోసం వెతుకులాట ప్రారంభించింది. పేరూరు బస్ స్టేషన్ దగ్గర ఓ ప్రైవేట్ బస్సుపైన తల్లి గుర్రంలాగే ఓ స్టిక్కర్‌ కనిపించడంతో బస్సుని అడ్డగించింది. బస్సుని వెంబడిస్తూ మూడు కిలోమీటర్లు పరుగెత్తింది. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తల్లికోసం ఆరాటపడుతున్న పిల్ల గుర్రం ఆవేదన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసి నెటిజన్లు కన్నీరు పెడుతున్నారు. ఈ పిల్ల గుర్రం త్వరగా తన తల్లి చెంతకు చేరాలని ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..