సమ్మర్‌లో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చిట్కాలివే వీడియో

Updated on: May 06, 2025 | 5:40 PM

ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎండలు అసాధారణ రీతిలో పెరగడం వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేవలం దాహం తీర్చుకోవడమే కాదు.. సూర్యుని తాపాన్ని తట్టుకొని శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకోవాలంటే పుష్కలంగా నీరు తాగాల్సిందే. డీహైడ్రేషన్ వల్ల మూత్ర విసర్జన సమస్యలు, నీరసం, రక్త ప్రసరణలో ఇబ్బందులు, బద్ధకం తదితర సమస్యలు తలెత్తుతాయి. హైడ్రేటెడ్​గా ఉండేందుకు ఎన్ని పండ్ల రసాలు తాగినా కేవలం స్వచ్ఛమైన నీటిని నేరుగా తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. తాజాగా వండిన ఆహారాన్ని తినడం మంచిది. నిల్వ ఉంచిన ఆహారంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం తక్కువ ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది.

తాజా ఆహారం మానసిక ఉల్లాసం, ప్రశాంతత, శక్తిని అందిస్తుంది. నిల్వ ఉంచిన ఆహారాన్ని నిరంతరం తినడం వల్ల శరీరంలో నీరసం వచ్చేస్తుంది. ప్రతి రోజూ మిగిలిపోయిన ఆహారాన్ని తినే వ్యక్తులు క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్‌లు లేనప్పుడు ఇలాంటివి సమస్యలు ఉండేవి కాదు. ఎప్పుడు వండేవి అప్పుడే తినేవారు. లేదా కొన్ని గంటల్లో తినేవారు. ఒకవేళ అన్నం తిన్నా.. దానిని గంజితోనో.. లేదా మజ్జిగతో తీసుకునేవారు అందుకే పాతకాలం మనుషులు ఎంతో బలంగా ఉండేవారు. ఉదయమే కాసేపు యోగా లేదా కండరాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ధ్యానం చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. శరీరంలో ఒత్తిడి తగ్గి, అప్రమత్తత పెరుగుతుంది. దీనితో రోజంతా మెదడు, శరీరం చురుకుగా ఉంటాయి. అలాగే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, చురుగ్గా ఉండాలన్నా వాకింగ్ చేయడం చాలా అవసరం. వేసవికాలంలో ఉదయం కనీసం అరగంటైనా నడిస్తే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని చెబుతారు.

మరిన్ని వీడియోల కోసం :
వాడు నావాడంటే.. నావాడు అంటూ ఓ సీఐ కోసం పోలీస్‌స్టేషన్‌లో కొట్టుకున్న మహిళలు
ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే.. అగ్ని ప్రమాదం సంభవిస్తుందా వీడియోఅడిగినంత పనీర్ వడ్డించలేదని పెళ్లి మండపంలో దారుణం వీడియో