Gold Caught: కోడ్‌ ఎఫెక్ట్‌.. పత్రాలు ఉన్నా అనుమతి లేదంటూ బంగారం, వెండి సీజ్‌.!

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులు పకడ్బంధీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు అమలుచేస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న వారు రూ. 50 వేలకు మించి నగదును చేతిలో ఉంచుకోకుడదు. ఒకవేళ అధిక మొత్తంలో డబ్బులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే తగిన రశీదును,

Gold Caught: కోడ్‌ ఎఫెక్ట్‌.. పత్రాలు ఉన్నా అనుమతి లేదంటూ బంగారం, వెండి సీజ్‌.!

|

Updated on: Apr 14, 2024 | 5:20 PM

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులు పకడ్బంధీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు అమలుచేస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న వారు రూ. 50 వేలకు మించి నగదును చేతిలో ఉంచుకోకుడదు. ఒకవేళ అధిక మొత్తంలో డబ్బులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే తగిన రశీదును, బిల్లులను, ఇన్వాయిస్ లను వెంట పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. తీసుకెళ్తున్న నగదుకు సరైన ఆధారాలు, లెక్కలు చూపిస్తే వదిలేస్తారు ఎన్నికల అధికారులు. అలా కాకుండా నగదు, బంగారం, వెండి ఇలా విలువైన వస్తువులు రవాణా చేస్తే వాటిని సీజ్ చేస్తారు.

ఈ క్రమంలోనే పెద్దాపురం నుంచి విశాఖపట్నానికి అక్రమంగా తరలిస్తున్న బంగారం, వెండిని గురువారం రాత్రి పట్టుకున్నారు ఎన్నికల ప్లేయింగ్ స్క్వాడ్. ఎటువంటి అనుమతులు లేకుండా 8.116 కేజీల బంగారం, 46.900 కేజీల వెండి తరలిస్తున్నట్లు గుర్తించారు. పెద్దాపురం దర్గా సెంటర్‎లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా BVC లాజిస్టిక్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కంటైనర్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ కావడంతో దానిని తెరిపించి పరిశీలించారు ప్లేయింగ్ స్విడ్, పోలీసు అధికారులు. అందులో పెద్ద ఎత్తున బంగారం, వెండి జ్యూవెలరీ పట్టుబడింది. పెద్దాపురం రాజు గారి వీధిలోని సామ్రాజ్య జ్యువెలరీ నుంచి వీటిని విశాఖపట్నం తరలిస్తున్నట్లు డ్రైవర్ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని వారు చెప్పినప్పటికీ కోడ్ అమలులో ఉన్న సమయంలో రవాణాకు అవసరమైన అనుమతి పత్రాలు లేవని పోలీసులు గుర్తించారు. రూ. 5.60 కోట్ల బంగారం, వెండి వస్తువులతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు అవసరమైన అనుమతి పత్రాలు తీసుకునివచ్చి తమకు చూపిస్తే వాహనంతో పాటు బంగారం, వెండిని తిరిగి అప్పగిస్తామని ఈఆర్ఓ జె సీతారామారావు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us