ఒక్క రోజులో రూ. 460 కోట్ల లిక్కర్ తాగేశారు

|

Jan 03, 2024 | 12:37 PM

నూతన సంవత్సర వేడుకల సందర్బంగా తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్‌ 31న ఒక్కరోజే ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్ , లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది. ఒక్కరోజులో 313 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలతో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. డిసెంబర్‌ 28న 133 కోట్లు, 29న 179 కోట్లు, 31న అత్యధికంగా 313 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

నూతన సంవత్సర వేడుకల సందర్బంగా తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్‌ 31న ఒక్కరోజే ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్ , లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది. ఒక్కరోజులో 313 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలతో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. డిసెంబర్‌ 28న 133 కోట్లు, 29న 179 కోట్లు, 31న అత్యధికంగా 313 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అటు ఏపీలోనూ అదే పరిస్థితి నిన్న ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 147 కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయింది. గత ఏడాది 142 కోట్ల రూపాయలు కాగా.. ఈ ఏడాది మరో ఐదు కోట్లు పెరిగింది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ చేసుకున్నసంబరాలు ప్రభుత్వ ఖజానాను నింపాయి. ఒక్కరోజులో మద్యం విక్రయాలు జరిగిన తీరు ఇప్పుడు అందర్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sudigali Sudheer: సైలెంట్‌గా.. ట్విస్ట్ ఇచ్చిన గాలోడు

Rakul Preet Singh: గుడ్‌ న్యూస్.. రకుల్‌ పెళ్లి.. డేట్ ఫిక్స్‌

ఆ ఒక్కడు.. చిరు ఫిదా చేసిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్‌

NTR జపాన్‌లో ఉండగానే భూకంపం.. ఆయన ఏమన్నారంటే..

అందరో రకం అయితే.. ఈమో రకం.. మళ్లీ లొల్లి షురూ..

Published on: Jan 03, 2024 12:35 PM