3D printed Ear: యువతికి 3డీ ప్రింటెడ్‌ చెవి..! అమెరికాలో ఆపరేషన్‌ విజయవంతం..

|

Jun 15, 2022 | 9:02 AM

అమెరికాలో 3డీ ప్రింటెడ్‌ టెక్నాలజీతో రూపొందించిన చెవిని తొలిసారి ఓ యువతికి విజయవంతంగా అతికించారు. టెక్సాస్‌కు చెందిన 3డీ బయో థెరప్యూటిక్స్‌ సంస్థ దీనిని రూపొందించింది.


అమెరికాలో 3డీ ప్రింటెడ్‌ టెక్నాలజీతో రూపొందించిన చెవిని తొలిసారి ఓ యువతికి విజయవంతంగా అతికించారు. టెక్సాస్‌కు చెందిన 3డీ బయో థెరప్యూటిక్స్‌ సంస్థ దీనిని రూపొందించింది. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. మెక్సికోకు చెందిన అలెక్సాకు కుడి వైపు వెలుపలి చెవి చిన్నదిగా ఉంది. పరిశీలించిన 3డీ బయో థెరప్యూటిక్స్‌ నిపుణులు ఆమె మరో చెవి నుంచి కణజాలాన్ని సేకరించారు.అచ్చు కుడివైపు చెవిమాదిరిగానే సహజమైందిగా అనిపించేలా ‘ఆరినోవో’అనే 3డీ టెక్నాలజీని వాడి మరో చెవికి రూపం కల్పించారు. టెక్సాస్‌లోని మైక్రోషియా–కాంజెనిటల్‌ ఇయర్‌ డిఫార్మిటీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సర్జన్‌ డాక్టర్‌ అర్డురో బొనిల్లా ఈ ప్రక్రియకు నేతృత్వం వహించారు. ఈ చెవిని సర్జరీ ద్వారా ఆమెకు అతికించారు. నెల రోజుల విశ్రాంతి అనంతరం తాజాగా అలెక్సా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది.రోగుల కార్టిలేజ్‌ కణాలను ఉపయోగించి చెవిని పునర్నిర్మించినట్లు ఇందుకు ఈ నూతన టెక్నాలజీని వినియోగించినట్లు డాక్టర్‌ అర్టురో చెప్పారు. దీని వల్ల కొత్త చెవిని శరీరం తిరస్కరించేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. ఒకటి లేదా రెండు చెవులు అసంపూర్ణంగా, వెలుపలి భాగాలు లేని మైక్రోషియా అనే లోపంతో ఉన్నవారికి ఈ ఆధునాతన చికిత్స ఎంతో ఉపయోగం అన్నారు. ఇప్పటి వరకు పేషెంట్‌ పక్కటెముకల నుంచి సేకరించిన కణాలను చెవి పునర్నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 15, 2022 09:02 AM