Drugs: విద్యార్థి జేబులో డ్రగ్స్ ఉంచిన పోలీసులు.. ఆ పై బెదిరించి లక్షల్లో దోపిడీ.
పుణెలో ఓ ధనిక కుటుంబానికి చెందిన విద్యార్థితో పరిచయం పెంచుకున్న పోలీసులు, మరికొందరు కలిసి అతడ్ని కేఫ్‌కు రప్పించారు. అక్కడ అతడి జేబులో డ్రగ్స్ ఉంచారు. కేసు నమోదు చేస్తామని బెదిరించి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఆ యువకుడి నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ విషయం బయటపడటంతో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
పుణెలో ఓ ధనిక కుటుంబానికి చెందిన విద్యార్థితో పరిచయం పెంచుకున్న పోలీసులు, మరికొందరు కలిసి అతడ్ని కేఫ్‌కు రప్పించారు. అక్కడ అతడి జేబులో డ్రగ్స్ ఉంచారు. కేసు నమోదు చేస్తామని బెదిరించి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఆ యువకుడి నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ విషయం బయటపడటంతో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. పింప్రి-చించ్‌వాడ్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థితో కొందరు వ్యక్తులు పరిచయం పెంచుకున్నారు. ఆ యువకుడి నమ్మకాన్ని పొందడంతోపాటు వివరాలు తెలుసుకున్నారు. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన వ్యక్తి అని గ్రహించారు. బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేశారు. ఆ వ్యక్తులు విద్యార్థిని ఒక కేఫ్‌కు పిలిచారు. అక్కడ అతడి జేబులో డ్రగ్స్ ప్యాకెట్ ఉంచారు. ఇద్దరు పోలీసులు ఆ యువకుడ్ని తనిఖీ చేశారు. డ్రగ్స్ కలిగి ఉన్న అతడిపై కేసు నమోదు చేస్తామని బెదిరించారు. 20 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. ఆ విద్యార్థి రూ.4.98 లక్షలు వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. ఆ యువకుడు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులను గుర్తించి ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..