Cartosat ISRO: శాటిలైట్‌ను సురక్షితంగా కూల్చివేసిన ఇస్రో.. ఎందుకంటే.!

Cartosat ISRO: శాటిలైట్‌ను సురక్షితంగా కూల్చివేసిన ఇస్రో.. ఎందుకంటే.!

Anil kumar poka

|

Updated on: Feb 19, 2024 | 10:41 AM

కార్టోశాట్-2 శాటిలైట్‌ జీవిత కాలం ముగియడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సురక్షితంగా దాన్ని కూల్చివేసింది. దానిని భూవాతావరణంలోకి రప్పించి వాలంటైన్స్‌ డే రోజున హిందూ మహాసముద్రంలో పడేసి వీడ్కోలు పలికింది. 2007 జనవరి 10న హై-రిజల్యూషన్ ఇమేజింగ్ శాటిలైట్‌ కార్టోశాట్-2ను నింగిలోకి ఇస్రో పంపింది. పట్టణ, గ్రామీణ మ్యాపులు, తీర ప్రాంత భూమి వినియోగం మ్యాపులు, రహదారి నెట్‌వర్క్ అధ్యయనం, పర్యవేక్షణ..,

కార్టోశాట్-2 శాటిలైట్‌ జీవిత కాలం ముగియడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సురక్షితంగా దాన్ని కూల్చివేసింది. దానిని భూవాతావరణంలోకి రప్పించి వాలంటైన్స్‌ డే రోజున హిందూ మహాసముద్రంలో పడేసి వీడ్కోలు పలికింది. 2007 జనవరి 10న హై-రిజల్యూషన్ ఇమేజింగ్ శాటిలైట్‌ కార్టోశాట్-2ను నింగిలోకి ఇస్రో పంపింది. పట్టణ, గ్రామీణ మ్యాపులు, తీర ప్రాంత భూమి వినియోగం మ్యాపులు, రహదారి నెట్‌వర్క్ అధ్యయనం, పర్యవేక్షణ, నీటి పంపిణీ మ్యాప్‌ల రూపకల్పన వంటి పలు సేవలను ఈ శాటిలైట్‌ అందించింది. 2019లో కార్టోశాట్-2 మిషన్‌ ముగిసింది. అది భూ వాతావరణంలోకి ప్రవేశించడానికి సుమారు 30 ఏళ్లు పడుతుందని ఇస్రో అంచనా వేసింది. అయితే అంతరిక్షంలో శాటిలైట్‌ వ్యర్థాలను తగ్గించాలన్న అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. సురక్షితమైన రీ ఎంట్రీని నిర్ధారించడానికి శాటిలైట్‌ కక్ష్యను క్రమంగా తగ్గించింది. మరోవైపు 2020లో 635 కిలోమీటర్ల కక్ష్యలో ఉన్న కార్టోశాట్-2లోని మిగిలిన ఇంధనాన్ని ఇస్రో వినియోగించింది. దీంతో వేగంగా 380 కిలోమీటర్ల కక్ష్యకు రప్పించింది. తాజాగా ఫిబ్రవరి 14న భూ వాతావరణంలోకి ప్రవేశించిన కార్టోశాట్-2ను సురక్షితంగా హిందూ మహాసముద్రంలో కూల్చివేసింది. ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..