Gujarat: చీరకట్టుతో 15వేల మంది- చూడ్డానికి 2 కళ్లూ చాలవు.. వీడియో వైరల్..

|

Apr 15, 2023 | 8:40 PM

భారతీయ సంప్రదాయంలో చీరకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. చీరలు స్త్రీలకు ఎంతో హుందాతనాన్ని తీసుకొస్తాయి.

భారతీయ సంప్రదాయంలో చీరకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. చీరలు స్త్రీలకు ఎంతో హుందాతనాన్ని తీసుకొస్తాయి. ఎన్ని రకాల దుస్తులు ధరించినా చీర ప్రత్యేకతే వేరు. ఏ సమయంలో ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలలో చీరదే మొదటి స్థానం. ఎంతటి వారైనా పెళ్లి సమయంలో చీర చుట్టాల్సిందే. అంతటి ప్రాధాన్యత కలిగిన చీరలను ధరించి తొలిసారిగా సూరత్‌లో శారీ వాకథాన్‌ నిర్వహించారు. ఇందులో గుజరాత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 వేలమంది మహిళలు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. గుజరాత్ సూరత్‌లో మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో ఏప్రిల్‌ 9న ‘శారీ వాకథాన్’ నిర్వహించారు. మహిళలల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేందకు దేశంలోనే తొలిసారిగా ఈ వాకథాన్‌ నిర్వహించారు. దాదాపు 3 కిలో మీటర్లు సాగిన ఈ వాకథాన్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర జౌళి, రైల్వే శాఖ సహాయమంత్రి, మేయర్‌, మున్సిపల్‌ కమిషనర్‌తోపాటు ఇతర రంగాలకు చెందిన మహిళలు సంప్రదాయ చీరకట్టులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘వన్‌ ఇండియా అండ్‌ ది బెస్ట్‌ ఇండియాకి’ ఈ కార్యక్రమం ఉదాహరణగా నిలిచిందన్నారు. సూరత్‌ లోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి యు-టర్న్‌ వరకూ ఈ సూరత్‌ శారీ వాకథాన్‌ జరిగింది. మహిళల పిట్‌నెస్‌గా అవగాహన కల్పించడమే కాకుండా ఈ కార్యక్రమం భారతీయ సంప్రదాయాలు, చీరకట్టు గొప్పదనం మరోసారి చాటిచెప్పిందని పలువులు ప్రశంసలు కురిపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 15, 2023 08:40 PM