Viral Video: ఆరేళ్ల బాలిక.. ఏకంగా మోదీకే ఫిర్యాదు చేసింది.. దేని గురించో తెలిస్తే షాక్ అవుతారు..

Viral Video: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. మన దేశంలోనూ అదే పరిస్థితి..

Viral Video: ఆరేళ్ల బాలిక.. ఏకంగా మోదీకే ఫిర్యాదు చేసింది.. దేని గురించో తెలిస్తే షాక్ అవుతారు..
Follow us
Shiva Prajapati

|

Updated on: May 31, 2021 | 6:48 PM

Viral Video: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. మన దేశంలోనూ అదే పరిస్థితి నెలకొంది. రోజుల తరబడి ఇళ్లలోనే ఉంటుండంతో వారి జీవన శైలిలోనూ మార్పులు వస్తున్నాయి. ఇక కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఆన్‌లైన్‌ క్లాస్‌ల పట్ల చాలా మంది విద్యార్థులు విసిగిపోతున్నారు. తాజాగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆరేళ్ల బాలిక.. గంటల తరబడి సాగే ఆన్‌లైన్ క్లాస్‌ల పట్ల విసిగెత్తిపోయింది. చివరికి ఏం చేయాలా? అని ఆలోచించి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేసింది. 45 సెకన్ల పాటు తీసిన వీడియోలో ఆ చిచ్చర పిడుగు ఆన్‌లైన్ క్లాస్‌ వల్ల తాను పడుతున్న ఇబ్బందులను హావభావాలతో వ్యక్తపరిచించింది.

ఈ వీడియోను జర్నలిస్ట్ ఔరంగజేబు నక్ష్‌బండి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆరేళ్ల కశ్మీర్ బాలిక.. గంటల తరబడి నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్లాస్‌లు, అధిక స్కూల్ వర్క్‌పై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తోంది.’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

కాగా, 45 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో క్లిప్‌లో ఆ చిన్నారి తన బాధలను చెప్పుకొచ్చింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆన్‌లైన్ క్లాస్‌లు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగాయంది. ‘ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఉర్దూ, ఈవిఎస్, కంప్యూటర్ క్లాస్ కూడా ఉన్నాయి. పిల్లలం అయిన మాకు ఇది చాలా పనిభారం పెంచుతుంది.’ అని ఆ చిన్నారి భారమైన హావభావాలతో వివరించింది. ‘మోదీ సార్.. చిన్న పిల్లలు ఎందుకు ఎక్కువ పని భారాన్ని ఎదుర్కోవాలి? పని భారం తగ్గాలంటే ఏం చేయాలి? నమస్కారం మోదీ సార్.. ఇక ఉంటాను(బై).’ అంటూ వీడియో ముగించేసింది.

ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. రెండు రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. 5 వేలకు పైగా లైక్స్ రాగా.. 1200 మందికి పైగా ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాగా, ఆ చిన్నారి కంప్లయింట్‌పై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘మోదీ జీ.. చిన్నారులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ గడుసు పిల్ల బాధలను మీరు వింటున్నారా?’ అంటూ కామెంట్స్ పెట్టారు. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో జరిగే హింస నుంచి చిన్నారులను కాపాడండి అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.

Also read:

Vizag Steel Plant CMD: విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండి పీ కె రథ్ పదవీ విరమణ.. కొత్త సారథి వచ్చే వరకు కె సీ దాస్‌కు తాత్కాలిక బాధ్యతలు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!