వీగన్ డైట్ అంటే ఏమిటి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి వీడియో
ఇటీవల బరువు తగ్గేందుకు చాలా మంది వీగన్ డైట్ ని అనుసరిస్తున్నారు. దీంతో ప్రయోజనం ఉంటుందా? దీనివల్ల కలిగే లాభాలేంటో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. గుడ్లు, పాలు, మాంసం, డైరీ ఉత్పత్తులను తీసుకోకుండా పండ్లు, డ్రై ఫ్రూట్స్, గింజలు, తృణధాన్యాలు వంటివి తీసుకోవడమే వీగన్ డైట్. ఈ డైట్ తో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కోలుకోవడంతో పాటు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు. బరువు తగ్గాలనుకునే వారికి వీగన్ డైట్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి.
మాంసం, డైరీ ఉత్పత్తుల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికం. వీటివల్ల శరీరానికి అందే శక్తి కూడా తక్కువే. ఇవే బరువు పెరిగేందుకు కారణం అవుతాయి. పండ్లు, కూరగాయలతో కూడిన వీగన్ డైట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. తక్కువ కేలరీలతో తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీగన్ డైట్ బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. దీంతో ఓబెసిటీ సమస్య రాదు. టైప్-2 మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వీగన్ డైట్ లో ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ తో పాటు చక్కెరను ఆహారంలో తీసుకుంటే శక్తిహీనంగా మారడంతో పాటు బరువు పెరిగే ప్రమాదం ఉంది. మాంసం వినియోగం తగ్గితే గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు అదుపులోకి వస్తాయి. తద్వారా పర్యావరణానికి కలిగే హాని కూడా తగ్గే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే వీడియో
బాంబులు పడతాయని భయం వేసింది వీడియో
ఆ మహిళతో మోదీకి చెప్పమన్నారుగా నిజంగానే చెప్పింది వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
