Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మజ్జిగా.. అని తీసిపారేయకండి..దీని పవర్‌ తెలిస్తే వదిలిపెట్టరు వీడియో

మజ్జిగా.. అని తీసిపారేయకండి..దీని పవర్‌ తెలిస్తే వదిలిపెట్టరు వీడియో

Samatha J

|

Updated on: May 13, 2025 | 8:09 AM

ప్రస్తుత కాలంలో చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. ఈ అనారోగ్యానికి కారణం ఏదైనా కిడ్నీలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. చాలామందిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి దివ్యౌషధం మజ్జిగ. మజ్జిగలో కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ ఉప్పు ఉన్న మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ అనే మంచి బాక్టీరియా ఉంటుంది.

మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు భోజనానికి ముందు మజ్జిగ తాగడం చాలా ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. భోజనానికి ముందు మజ్జిగ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు విచ్ఛిన్నమై శరీరం నుండి బయటకు పడతాయి. కానీ మజ్జిగలో చిటికెడు ఇంగువ కలుపుకొని తీసుకుంటే కిడ్నీలో ఎంత పెద్ద రాయి అయినా అది విరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వెళుతుంది. ఈ పానీయం మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఉత్తమమైనదిగా నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత చిటికెడు ఇంగువను మజ్జిగలో కలుపు తీసుకుంటే కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. తొందరగా జీర్ణం అవుతుంది. కడుపులో ఏర్పడే అజీర్తి, యాసిడిటీ వంటి సమస్యలను తగ్గించడానికి మజ్జిగ సహాయపడుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు మజ్జిగలో జీలకర్ర, ఇంగువ, సైందవ లవణం కలిపి తీసుకున్నట్లయితే ఉదర సమస్యలు తగ్గుతాయి. అలాగే పరగడుపున మజ్జిగ తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

మరిన్ని వీడియోల కోసం :

80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే వీడియో

బాంబులు పడతాయని భయం వేసింది వీడియో

ఆ మహిళతో మోదీకి చెప్పమన్నారుగా నిజంగానే చెప్పింది వీడియో