Chinna Arunachalam: ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు
భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని , దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని శ్రీ రమణ ఆశ్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఇది చిన్న అరుణాచలంగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే.. ఒకే చోట మొత్తం 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. నేడు అరుణాచలేశ్వర స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు.
శివ ముక్కోటి సందర్భంగా ద్వితీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా, దమ్మ గూడెం మండలం, చిన్న అరుణాచలంలో ఈరోజు అపితా కుచంబీక సహిత అరుణాచలేశ్వర స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఎంతోమంది భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించి తన్మయత్వం చెందారు. మూడు రోజులుగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో పూర్తవుతున్నాయని ఆలయ వ్యవస్థాపకులు శివనాగ స్వామి తెలియజేశారు.
భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని, దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని శ్రీ రమణ ఆశ్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఉన్న విషయం తెలిసిందే. ఇది చిన్న అరుణాచలంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ క్షేత్రం ప్రాముఖ్యత ఏమిటంటే.. ఒకే చోట మొత్తం 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ప్రధాన లింగంతో కలిపి మొత్తం 1008 లింగాలు ఉన్నాయి. కాశి క్షేత్రం, శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఇలా సహస్ర లింగాల దర్శనం జరుగుతుంది. రామేశ్వరంలోని స్పటిక లింగం జ్యోతిర్లింగం ఏ విధంగా దర్శనమిస్తుందో.. అదే విధంగా ఇక్కడ స్ఫటిక జ్యోతిర్లింగం భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడి అద్దాల మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..