Russia subs: అలాస్కా తీరంలో బఫర్ జోన్‌ను దాటిన రష్యా సబ్ మెరైన్లు.!
ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో అమెరికా, రష్యా ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం జరిగింది. అమెరికా జలాల్లోకి రష్యా సబ్‌మెరైన్లు ప్రవేశించాయి. అలస్కా తీరంలో బఫర్‌జోన్‌ను దాటి ఇవి ప్రవేశించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ తెలిపింది. వీటి కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పింది. రష్యా మిలటరీ వెజల్ బృందంలో రెండు సబ్‌మెరైన్లు, ఒక ఫ్రిగేట్, ఒక టగ్‌బోట్..
ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో అమెరికా, రష్యా ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం జరిగింది. అమెరికా జలాల్లోకి రష్యా సబ్‌మెరైన్లు ప్రవేశించాయి. అలస్కా తీరంలో బఫర్‌జోన్‌ను దాటి ఇవి ప్రవేశించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ తెలిపింది. వీటి కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పింది. రష్యా మిలటరీ వెజల్ బృందంలో రెండు సబ్‌మెరైన్లు, ఒక ఫ్రిగేట్, ఒక టగ్‌బోట్ ఉన్నాయని ఇవి సముద్ర సరిహద్దును దాటి 30 మైళ్ల లోపలికి వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం అమెరికా ప్రాదేశిక జలాల పరిధికి బయట ఉన్న యూఎస్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో ఇవి ప్రయాణిస్తున్నట్లు చెప్పింది.
సముద్రంలో మంచు ఫలకాలను తప్పించుకోవడం కోసం రష్యా నేవీ బృందం ఈ మార్గంలో ప్రయాణించి ఉంటుందని యూఎస్ కోస్ట్‌గార్డ్ భావిస్తోంది. అంతర్జాతీయ నిబంధనలకు లోబడే వీటి ప్రయాణం ఉన్నప్పటికీ.. వీటి కదలికలను తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు అమెరికా తెలిపింది. బేరింగ్ జలసంధి వద్ద అమెరికా సముద్ర సరిహద్దుల్లో కోస్ట్‌గార్డ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో వీటిని గుర్తించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.