Cyber Police: నెట్‌లో మీరేం చూస్తున్నారో ‘మాకు తెలుసు.! సైబర్‌ పోలీసులం అంటూ..

Cyber Police: నెట్‌లో మీరేం చూస్తున్నారో ‘మాకు తెలుసు.! సైబర్‌ పోలీసులం అంటూ..

Anil kumar poka

|

Updated on: Sep 23, 2024 | 10:28 AM

‘మీ ఐపీ అడ్రస్‌తో ఏం చేస్తున్నారో.. ఇంకేం చూస్తున్నారో మాకు తెలుస’ంటూ.. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల పేరిట వాట్సప్‌ నంబర్, ఈ-మెయిల్‌కు హెచ్చరికలు వస్తే.. ఎవరైనా భయపడతారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని సైబర్‌ మాయగాళ్లు నగరవాసులను భయపెట్టి అందినంత సొమ్ము వసూలు చేస్తున్నారు. నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులకు రోజూ సగటున 10 ఫిర్యాదులు అందుతున్నాయి.

‘మీ ఐపీ అడ్రస్‌తో ఏం చేస్తున్నారో.. ఇంకేం చూస్తున్నారో మాకు తెలుస’ంటూ.. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల పేరిట వాట్సప్‌ నంబర్, ఈ-మెయిల్‌కు హెచ్చరికలు వస్తే.. ఎవరైనా భయపడతారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని సైబర్‌ మాయగాళ్లు నగరవాసులను భయపెట్టి అందినంత సొమ్ము వసూలు చేస్తున్నారు. నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులకు రోజూ సగటున 10 ఫిర్యాదులు అందుతున్నాయి. సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ, కస్టమ్స్‌ విభాగాల అధికారులమంటూ బెదిరించి రూ.లక్షలు వసూలు చేశారంటూ వచ్చే బాధితులే ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

సీబీఐ, సైబర్‌క్రైమ్‌ అధికారులమనగానే ఎవరైనా భయపడుతుంటారు. తమ ఆధార్, పాన్‌కార్డు, ఇంటి చిరునామా వివరాలు ఒక్కొక్కటి చెబుతుంటే నిజమనే అభిప్రాయానికి వస్తున్నారు. వృద్ధులైతే ఈ వయసులో కేసులు, కోర్టులు ఎందుకనే ఆందోళనకు గురవుతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకునేందుకు వెనుకాడుతున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతానికి చెందిన బాధితుడు ఈడీ విభాగం అనగానే భయపడి రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. 3 నెలల తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. ఆందోళనతో ఏం చేయాలో తోచక ఆలస్యంగా ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితుడు చెప్పాడు.

తాజాగా నిందితులు ఢిల్లీ, ముంబయి సైబర్‌క్రైమ్‌ పోలీసులమంటూ బెదిరిస్తున్నారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, స్టేట్‌ సైబర్‌ సెల్, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అంటూ రంగంలోకి దిగుతున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నారని.. తమ పరిశోధన విభాగం నిఘాలో మీ ఐపీ అడ్రస్‌లో వీడియోలను వీక్షిస్తున్నట్లు గుర్తించినట్టు భయపెడతారు. దీనికి 24 గంటల్లో సమాధానం రాకుంటే అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తామంటూ అల్టిమేటం ఇస్తారు. స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేసేలా తాము ఆదేశాలిస్తామంటారు. ఇదంతా నిజమని భావించిన బాధితులు అడిగినంత సొమ్ము మాయగాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేసి నష్టపోతున్నారు. రాష్ట్ర, కేంద్ర నిఘా, దర్యాప్తు విభాగాలు నోటీసులు జారీ చేయడం.. వీడియోకాల్‌ ద్వారా విచారణ జరపటం చేయవని సైబర్‌క్రైమ్‌ పోలీసులు స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.