BJP MLA: రైలుకి పచ్చజెండా ఊపబోయి.. రైల్వే ట్రాక్‌పై ప‌డిపోయిన MLA.!

BJP MLA: రైలుకి పచ్చజెండా ఊపబోయి.. రైల్వే ట్రాక్‌పై ప‌డిపోయిన MLA.!

Anil kumar poka

|

Updated on: Sep 23, 2024 | 10:36 AM

ఉత్తర‌ప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం త‌ప్పింది. ఆగ్రా-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇటావా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇటావా ఎమ్మెల్యే స‌రితా భ‌దోరియా కూడా హాజరయ్యారు. ప‌చ్చజెండా ఊపి రైలును ప్రారంభించడానికి ఆమె అక్కడికి వచ్చారు. కార్యక్రమానికి ఆమెతోపాటు ఇతర బీజేపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఉత్తర‌ప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం త‌ప్పింది. ఆగ్రా-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇటావా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇటావా ఎమ్మెల్యే స‌రితా భ‌దోరియా కూడా హాజరయ్యారు. ప‌చ్చజెండా ఊపి రైలును ప్రారంభించడానికి ఆమె అక్కడికి వచ్చారు. కార్యక్రమానికి ఆమెతోపాటు ఇతర బీజేపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. జనాలు ఎక్కువగా ఉండడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆమె పచ్చ జెండా ఊపబోయి రైల్వే ఫాట్‌ఫామ్ నుంచి అమాంతం ప‌ట్టాల‌పై ప‌డిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రైలును ఫ్లాగ్ ఆఫ్ చేసే కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు ఇటావా రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌లో భారీ రద్దీ నెలకొంది. సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసేందుకు వీలుగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవాన్ని షూట్ చేయడం కోసం ప్లాట్‌ఫారమ్ వద్ద పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూగారు. అయితే అక్కడి పరిస్థితిని పోలీసులు కంట్రోల్‌ చేయలేకపోయారు. కొద్ది నిమిషాల పాటు అదుపు తప్పి తోపులాట జరిగింది. ఎమ్మెల్యే ప్లాట్‌ఫారమ్‌పై నుంచి కిందపడినప్పుడు వెనుక ఓ పోలీసు కూడా నిలబడి ఉన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరడానికి ముందు ఇది జరిగింది. మహిళా ఎమ్మెల్యే సరితా భదోరియా రైల్వే ట్రాక్‌పై పడిపోవడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎమ్మెల్యే సరితకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అక్కడ ఉన్న పార్టీ కార్యక‌ర్తలు, భ‌ద్రతా సిబ్బంది ఆమెను త‌క్షణ‌మే ప‌ట్టాల మీద నుంచి లేపారు. దీంతో ఆమె తిరిగి ప్లాట్‌ఫాంపైకి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే స‌రితా .. త‌న చేతుల్లో ఉన్న పచ్చజెండాను ఊపి, రైలు ప్రారంభించారు. అయితే, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని చూసేందుకు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను రైల్వే స్టేషన్‌లోకి అనుమతించిన వారిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ప్లాట్‌ఫారమ్‌పైకి ఇంత పెద్ద సంఖ్యలో జనాన్ని ఎలా అనుమతించారంటూ నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.