WITT: UCC ఒక సామాజిక సంస్కరణ.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్ షా
టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా యూనిఫాం సివిల్ కోడ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు చేసితీరుతామని ఆయన తేల్చి చెప్పారు. దానికి అవసరమైన విశ్లేషణ జరుగుతుందని తెలిపారు. యూసీసీ కొందరికి రాజకీయ సమస్య కావచ్చు. కానీ ఇది ఒక సామాజిక సంస్కరణ అని అమిత్ షా అన్నారు....
టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా యూనిఫాం సివిల్ కోడ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు చేసితీరుతామని ఆయన తేల్చి చెప్పారు. దానికి అవసరమైన విశ్లేషణ జరుగుతుందని తెలిపారు. యూసీసీ కొందరికి రాజకీయ సమస్య కావచ్చు. కానీ ఇది ఒక సామాజిక సంస్కరణ అని అమిత్ షా అన్నారు. దేశంలో ఏ మతం ప్రాతిపదికన చట్టం ఉండకూడదని ప్రజాస్వామ్యం డిమాండ్ చేస్తుందని అమిత్ షా అన్నారు. దేశంలోని చట్టం నేటి పరిస్థితులకు అనుగుణంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలన్నారు. దేశంలోని శాసనసభ, పార్లమెంటు తగిన సమయంలో ఒకే విధమైన పౌర చట్టాన్ని తీసుకురావాలని మన రాజ్యాంగ సభ అధికరణ 44లో లక్ష్యంగా పెట్టుకుందని షౄ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
Published on: Feb 28, 2024 10:27 AM
వైరల్ వీడియోలు
Latest Videos