Tsunami: గోవాకు సునామీ హెచ్చరికలు..? ఆగకుండా 20 నిమిషాల పాటు సైరన్..
గోవాలో సునామీ హెచ్చరికలు కలకలం రేపాయి. ఎలాంటి భూకంపంకానీ, అలాంటి సూచనలు కానీ లేకుండానే సునామీ సైరన్ మోగింది. ఒక్కసారిగా సునామీ సైరన్ మోగడంతో గోవా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానిక పోర్వోరిమ్ ప్రాంతంలో ఓ కొండపై ఎర్లీ వార్నింగ్ డిస్సిమినేషన్ సిస్టమ్( EWDS)ను ఏర్పాటు చేశారు. ఇది విపత్తులను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుంది.
గోవాలో సునామీ హెచ్చరికలు కలకలం రేపాయి. ఎలాంటి భూకంపంకానీ, అలాంటి సూచనలు కానీ లేకుండానే సునామీ సైరన్ మోగింది. ఒక్కసారిగా సునామీ సైరన్ మోగడంతో గోవా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానిక పోర్వోరిమ్ ప్రాంతంలో ఓ కొండపై ఎర్లీ వార్నింగ్ డిస్సిమినేషన్ సిస్టమ్( EWDS)ను ఏర్పాటు చేశారు. ఇది విపత్తులను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 6 రాత్రి సునామీ సైరన్ 20 నిమిషాల పాటు కంటిన్యూగా మోగింది. సైరన్ ఎంతకీ ఆగకపోవడంతో ప్రజలు హడలిపోయారు. చివరికి ఇది పొరబాటున మోగినట్టు గుర్తించారు. దీనిపై ఉత్తర గోవా జిల్లా కలెక్టర్ మము హేగే వివరణ ఇచ్చారు. సాంకేతిక సమస్య వల్లే సైరన్ మోగిందని వెల్లడించారు. సైరన్ మోగడంపై భారత వాతావరణ విభాగంతో మాట్లాడామని, సునామీకి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు లేవని వారు తమతో చెప్పినట్టు కలెక్టర్ వివరించారు. సైరన్ మోగడానికి గల కారణాలను గుర్తించాలని రాష్ట్ర జలవనరుల శాఖను కోరినట్టు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..