Watch: యరాడ బీచ్ లో విదేశీ పర్యాటకులకు తప్పిన ప్రమాదం...ఏం జరిగిందంటే..

Watch: యరాడ బీచ్ లో విదేశీ పర్యాటకులకు తప్పిన ప్రమాదం…ఏం జరిగిందంటే..

Maqdood Husain Khaja

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 21, 2024 | 8:39 PM

విశాఖలోని యారాడ బీచ్‌లో విదేశీ పర్యాటకులకు ఘోర ప్రమాదం తప్పింది. సముద్రపు కెరటాల్లోపడి నలుగురు విదేశీ టూరిస్టులు కొట్టుకుపోయారు. దీంతో వారి సహచరులు పెద్దగా అరుపులు, కేకలు పెట్టారు. అది విన్న లైఫ్‌ గార్డ్స్ వెంటనే అప్రమత్తమయ్యారు.. కొట్టుకుపోతున్న విదేశీయులను అక్కడి కోస్టు గార్డు కాపాడారు.

విశాఖలోని యారాడ బీచ్‌లో విదేశీ పర్యాటకులకు ఘోర ప్రమాదం తప్పింది. సముద్రపు కెరటాల్లోపడి నలుగురు విదేశీ టూరిస్టులు కొట్టుకుపోయారు. దీంతో వారి సహచరులు పెద్దగా అరుపులు, కేకలు పెట్టారు. అది విన్న లైఫ్‌ గార్డ్స్ వెంటనే అప్రమత్తమయ్యారు.. కొట్టుకుపోతున్న విదేశీయులను అక్కడి కోస్టు గార్డు కాపాడారు. ఎనిమిది ఇటలీ ప్రయాణికులు విశాఖ పర్యటనకు వచ్చినట్టుగా తెలిసింది. కాగా, ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైన నలుగురు టూరిస్టులను కాపాడిన కోస్ట్‌ గార్డును ఉన్నత అధికారులు అభినందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Published on: Sep 21, 2024 07:54 PM